- రాష్ట్రంలో జోరుగా సెక్స్ మార్పిడి శస్త్ర చికిత్సలు
- అమ్మాయిలుగా అబ్బాయిలు
- ముందుగా బాలురకు జల్సాలు
- తర్వాత సెక్స్‌మార్పిడి ఆపరేషన్, అక్రమ కార్యకలాపాలు
రాష్ట్రంలో
లింగ మార్పిడి ముఠా కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. బయటకు తెలియకుండానే
పెద్ద సంఖ్యలో లింగ మార్పిడి శస్త్రచికిత్సలు చేయిస్తున్నట్లు
తెలుస్తోంది. తాజాగా చిక్కబళ్ళాపురంలో ఓ బాలుడు నెల రోజుల్లోనే బాలికగా
మారిన వైనం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసు యంత్రాంగం అంతా కదిలి
సీరియస్‌గా దర్యాప్తు చేపట్టింది.
బెంగళూరు, ఏప్రిల్ 9 : రాష్ట్రంలో
సెక్స్ మార్పిడి ముఠా వ్యవహారం జోరుగా సాగుతోంది. బయటకు సమాచారం
తెలియకుండానే పెద్ద సంఖ్యలో సెక్స్ మార్పిడి శస్త్రచికిత్సలు
చేయిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా చిక్కబళ్ళాపురంలో ఓ బాలుడు నెల
రోజుల్లోనే బాలికగా మారిన వైనం వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదివే
బాలురలను టార్గెట్ చేసుకొని ఈ ముఠా సెక్స్ మార్పిడి శస్త్రచికిత్సలకు
పాల్పడుతోంది. పగటి వేళల్లో రద్దీ ప్రాంతాలు, రైళ్ళు, చెక్‌పోస్టుల వద్ద
భిక్షాటన, రాత్రి వేళల్లో అక్రమ కార్యకలాపాలు ఈ ముఠా కార్యకలాపాలుగా
మారాయి. ముందుగా బాలురకు ఆశ చూపి వారిని మద్యంతో పాటు జల్సాలకు అలవాటు చేసి
ఆ తర్వాత సున్నితంగా సెక్స్ మార్పిడి చేయిస్తున్నారు. ఇలా రాష్ట్రంలో
వందలాది మంది యువకులను యువతులుగా మార్చేసి వ్యాపారం చేస్తున్నారు.
బెంగళూరుతో పాటు పూణెలో ఇప్పటికే పలు లింగ మార్పిడి శస్త్ర చికిత్సలు
జరిపినట్లు వెలుగులోకి వచ్చింది. ఒక్కొక్క శస్త్రచికిత్సకు రూ.3 లక్షల దాకా
ఖర్చు చేసే ఈ ముఠా వారి చేత తప్పుడు పనులు చేయించడంతో పాటు హిజ్డాలుగా
వ్యవహరింపజేస్తున్నారు. వీరి ముఠాలో చిక్కుకున్న వారికి స్థానికంగా కాకుండా
ఇతర ప్రాంతాల్లో విలాసంగా గడిపేలా చేస్తారు. ఆ తర్వాత వారు వ్యసనాలకు
బానిసలుగా మారాక ఈ ఆపరేషన్లు చేయిస్తున్నారు. చిక్కబళ్ళాపురంనకు చెందిన ఓ
బాలుడిని ఇటీవలే ఈ ముఠా అదుపులోకి తీసుకొంది. బెంగళూరులోని ట్యానరీ
రోడ్డులో కొన్ని రోజులు ఉంచి అనంతరం మాగడి, నెలమంగళలోని సోలూరుకు
తరలించారు. విషయం తెలుసుకున్న తల్లి సోలూరులో గాలించి ఎట్టకేలకు ఆ బాలుడిని
గుర్తించింది. అప్పటికే ఆ బాలుడు లింగ మార్పిడి చేయించుకొని బాలికగా
మారడంతో తల్లితో పాటు కుటుంబీకులు నిర్ఘాంత పోయారు. ఆ వెంటనే ముఠా రంగంలోకి
దిగి సదరు బాలికను అక్కడి నుంచి తరలించారు. బాలుడి తల్లి పోలీసులకు
ఫిర్యాదు చేయడంతో ముఠా కోసం గాలిస్తున్నారు. ఈ ముఠా ఇప్పటికే బెంగళూరు
శివారులో 100 మందికి పైగా లింగ మార్పిడి ఆపరేషన్లు జరిపినట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment