న్యూఢిల్లీ
: కోహినూర్ వజ్రాన్ని వెనక్కి తేలేమని సుప్రీం కోర్టుకు కేంద్రం స్పష్టం
చేసింది. కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తీసుకురావాలంటూ ఆల్ఇండియా
హ్యూన్‌రైట్స్ సోషల్ జస్టిస్ ఫ్రంట్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై సోమవారం సుప్రీంలో విచారణ జరిగింది. భారత్‌ను పరిపాలించే సమయంలో
ఈస్ట్‌ఇండియా కంపెనీ కోహినూర్ వజ్రాన్ని బలవంతంగా తీసుకెళ్లిదంటూ వస్తున్న
వాదనలో పసలేదని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈమేరకు
కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ సుప్రీంలో అఫిడవిట్‌ను దాఖలు
చేశారు. కోహినూర్ వజ్రాన్ని మహారాజా రంజిత్ సింగ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి
బహుమతిగా ఇచ్చారని, కోహినూర్ వజ్రం చోరీకి గురవ్వలేదని తెలిపింది. ఎవరూ
బలవంతంగా తీసుకోలేదని అందుకే మనం కోహినూర్ వజ్రాన్ని క్లయిమ్ చేసుకోలేమని
అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వాదనలు విన్న సుప్రీం కోర్టు ఆరు వారాల్లో
పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోహినూర్ వజ్రం ప్రస్తుతం
లండన్‌లో ఉంది.

No comments:
Post a Comment