Monday, 11 April 2016

4జీ దిశగా టెలినార్‌..!


న్యూదిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థల్లో ఒకటైన టెలినార్‌ 4జీ సేవలందించే దిశగా ప్రయత్నాలు చేపడుతోంది. 2016 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశవ్యాప్తంగా ఆరు సర్కిళ్లలో 4జీ సేవలను అందుబాటులోకి తెస్తామని టెలినార్‌ ఇండియా సీఈవో శరద్‌ మెహ్రోత్రా తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ఓ చైనా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.
టెలినార్‌ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆరు సర్కిళ్ల ద్వారా మొబైల్‌ సేవలందిస్తోంది. ఉత్తరప్రదేశ్‌(పడమర), యూపీ(తూర్పు), బిహార్‌(ఝార్ఖండ్‌తో కలిసి), ఆంధ్రప్రదేశ్‌(తెలంగాణ సహా), మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఈ టెలికాం సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే అసోంలోనూ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ట్రాయ్‌ సమాచారం ప్రకారం.. జనవరి నాటికి దేశవ్యాప్తంగా 7.24లక్షల మంది టెలినార్‌ వినియోగదారులున్నారు. ఇందులో 30శాతానికి పైగా మొబైల్‌ డేటాను వినియోగిస్తున్నారు. అయితే 3జీ, 4జీ సేవలు లేకపోవడంతో మిగతా ఆపరేటర్లతో పోలిస్తే.. ఇటీవల టెలినార్‌ కాస్త వెనుకబడిపోయింది. దీంతో వినియోగదారుల అవసరాల మేరకు 4జీ సేవలను తీసుకొస్తున్నట్లు సంస్థ తెలిపింది.

No comments:

Post a Comment