Friday, 22 April 2016

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో బాలికల హవా...

        హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ జనరల్‌, వృత్తివిద్య ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్‌ విద్యామండలి కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలు విడుదల చేశారు.
బాలికలదే పైచేయి...
       ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 53.32 శాతం మంది, సెకండియర్‌లో 62.01 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా ఇంటర్‌ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.
      ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 4,56,675 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా... 2,43,503 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 53.55 శాతం నమోదైంది. బాలికలు 59 శాతం మంది, బాలురు 48 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
       ద్వితీయ సంవత్సరంలో 4,18,231 మంది పరీక్షలు రాయగా.. 262,245 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 62.64 శాతం నమోదైంది. వీరిలో బాలికలు 67.64 శాతం మంది, బాలురు 58.11 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో రంగారెడ్డి ప్రథమ స్థానంలో నిలిచింది.
        గతేడాదితో పోలిస్తే మొదటి సంవత్సరం ఫలితాల ఉత్తీర్ణత శాతం తగ్గగా... ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత స్వల్పంగా పెరిగింది.

     ఇంటర్‌ ప్రథమ సంవత్సర ఫలితాల్లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 69శాతం ఉత్తీర్ణత నమోదవగా, అత్యల్పంగా నల్గొండ జిల్లాలో 41శాతం నమోదైంది. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అత్యధికంగా రంగారెడ్డిలో 76 శాతం, అత్యల్పంగా నల్గొండ, మెదక్‌ జిల్లాల్లో 53 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఇంటర్‌ ప్రథమ.. జిల్లాల వారీగా ఉత్తీర్ణత శాతం జిల్లా పేరు                            ఉత్తీర్ణతశాతం
* అదిలాబాద్‌                              48
* మెదక్‌                                     43
* రంగారెడ్డి                                 69
* నిజామాబాద్‌                          48
* మహబూబ్‌నగర్‌                     44
* కరీంనగర్‌                               47
* ఖమ్మం                                 55
* వరంగల్‌                                48
* నల్గొండ                                41
* హైదరాబాద్‌                           56
ఇంటర్‌ ద్వితీయ జిల్లాల వారీ ఉత్తీర్ణత శాతం
జిల్లా పేరు                             ఉత్తీర్ణతశాతం
* ఆదిలాబాద్‌                         60
* మెదక్‌                                53
* రంగారెడ్డి                             76
* నిజామాబాద్‌                       62
* మహబూబ్‌నగర్‌                  55
* కరీంనగర్‌                            58
* ఖమ్మం                               65
* వరంగల్‌                              59
* నల్గొండ                               53
* హైదరాబాద్‌                          63
 

 
మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు...
        ఇంటర్‌ పరీక్షల్లో తప్పిన విద్యార్థుల మే 24 నుంచి మే 31 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు ఫీజు ఏప్రిల్‌ 30 తేదీలోగా చెల్లించాలి.

No comments:

Post a Comment