Thursday, 10 November 2016

క్యాష్‌ ఆన్‌ డెలివరీ బంద్‌...

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పలు ఈ-కామర్స్‌ సంస్థలు క్యాష్‌ ఆన్‌ డెలివరీ (సీవోడీ) సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. మరికొన్ని సంస్థలు సీవోడీ ఆర్డర్లపై పరిమితులు విధించాయి. అమెజాన్‌ సంస్థ క్యాష్‌ ఆన్‌ డెలివరీ సేవలను పూర్తిగా నిలిపివేసింది. 8వ తేదీ వరకు సీవోడీ ద్వారా ఆర్డరు చేసిన వినియోగదారులను సైతం డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు జరపాలని సూచించింది. అవి అందుబాటులో లేని పక్షంలో చెల్లుబడి అయ్యే నోట్లను ఇచ్చి వస్తువులను డెలివరీ తీసుకోవాలని కోరింది. స్నాప్‌డీల్‌, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు సీవోడీ ఆర్డర్లపై పరిమితులు విధించాయి. రూ.2 వేలు లోపు కొనుగోళ్లకే సీవోడీ ఆర్డర్లను అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ-కామర్స్‌ సంస్థలు జరిపే లావాదేవీల్లో 60 శాతం సీవోడీ ద్వారానే జరుగుతుంటాయి. త్వరలోనే సీవోడీ ఆర్డర్లను పునరుద్ధరిస్తామని ఈ-కామర్స్‌ సంస్థలు ప్రకటించాయి.

No comments:

Post a Comment