Thursday, 10 November 2016

రేపటి నుంచి ఏటీఎంల్లో కొత్త నోట్లు...

దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంలు 11వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో పనిచేస్తాయని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి అశోక్‌ లావాసా తెలిపారు. అదే రోజు నుంచి కొత్తగా ముద్రించిన రూ.500, రూ.2 వేల నోట్లు ఏటీఎంల్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. అయితే కొద్దిరోజుల పాటు వినియోగదారులు రోజుకి రూ.2 వేలు మాత్రమే ఏటీఎం నుంచి డ్రా చేసుకొనే వెసులుబాటు ఉంటుందని, వారానికి గరిష్ఠంగా రూ.20వేలు వితడ్రా చేసుకోవచ్చని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏటీఎంల్లో పాత నోట్లను మార్చేందుకు వీలుగా బుధ, గురువారాల్లో ఏటీఎంలను మూసివేసిన విషయం విదితమే. కొద్ది రోజులపాటు ఏటీఎంల నుంచి నగదు వితడ్రాయిల్స్‌ భారీగా పెరుగుతాయని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. దీనికి అనుగుణంగా తరచూ ఏటీఎంల్లో నగదు నింపేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. వంద నోట్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా అన్ని ఎస్‌బీఐ బ్రాంచీలు, ఏటీఎంల్లో రానున్న రెండు రోజుల్లో రూ.100 నోట్లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచనున్నట్లు ఎస్‌బీఐ ఎండీ రజనీష్‌ కుమార్‌ ప్రకటించారు.

No comments:

Post a Comment