Saturday, 25 December 2021

చలి చంపేస్తోందా.. టీ, కాఫీల్లో ఇవీ ట్రై చేయండి!

చలికాలంలో మనం తాగే టీ, కాఫీలో కొన్ని పదార్థాలు వాడటం ద్వారా ఒంట్లో వేడి పెంచుకొని ఆరోగ్యంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

దాల్చిన చెక్క: చలికాలంలో టీ, కాఫీలను సర్వ్‌ చేసే ముందు కొద్దిగా దాల్చిన చెక్క లేదా దాని పొడిని కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దాల్చిన చెక్కతో మంచి సువాసనతో కూడిన తేనీటిని ఆస్వాదించమే కాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు.

అల్లం: చలికాలంలో శక్తినిచ్చే పదార్థాల్లో అల్లం కూడా ఒకటి. టీ, కాఫీల్లో అల్లం మరిగించి తీసుకుంటే శరీరానికి రెట్టించే ఉత్సాహం కలుగుతుంది. పైగా మార్కెట్లో ఇది చౌకగా లభిస్తుంది.

పుదీనా, చాక్లెట్‌: టీ, కాఫీల్లో కొన్ని పుదీనా ఆకులను కలిపి తాగడం చలికాలంలో మరీ మంచిది. వీటితో పాటే ఓ చాక్లెట్‌ ముక్కను కాఫీలో కలిపి తీసుకోవడం ద్వారా చలికాలంలో వెచ్చగా ఉండొచ్చు

No comments:

Post a Comment