Wednesday, 19 October 2016

ఎయిర్‌టెల్ మరో బంపరాఫర్.. రూ.259కే..

రిలయన్స్ జియో ప్రభావమో ఏమో.. టెలికం సంస్థలు దెబ్బకు దిగొస్తున్నాయి. ఇప్పటికే టారిఫ్ ప్లాన్లను బాగా తగ్గించి వినియోగదారులను ఆకట్టుకుంటున్న సంస్థలు జియోతో పోటిపడుతున్నాయి. తాజాగా మార్కెట్ పోటీని తట్టుకునేందుకు భారతి ఎయిర్‌టెల్ బుధవారం మరో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. కొత్తగా కొనుగోలు చేసే ఏ 4జీ మొబైల్‌కైనా రూ.259తో 10 జీబీ డాటాను ఇస్తున్నట్టు ప్రకటించింది. అంటే 1 జీబీ కేవలం రూ.25కే అన్నమాట. భారతదేశమంతటా ఈ ఆఫర్ వర్తిస్తుంది. రీచార్జ్ చేసిన వెంటనే 1 జీబీ వినియోగదారుడి ఖాతాలో చేరుతుంది. మిగతా 9 జీబీల డాటాను ‘మై ఎయిర్‌టెల్’ యాప్ ద్వారా పొందవచ్చు. కొత్త వినియోగదారులు మూడు నెలల వ్యవధిలో గరిష్టంగా మూడుసార్లు రీచార్జ్ చేసుకోవచ్చు. ఆగస్టులో ఈ ఆఫర్‌ను కేవలం సామ్‌సంగ్ గెలాక్సీ జె సిరీస్ ఫోన్ల కొన్నవారికి మాత్రమే పరిమితం చేయగా ఇప్పుడు అన్ని ఫోన్లకు వర్తింపజేసింది. గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో ప్రారంభించిన ఈ ఆఫర్‌ను ఇప్పుడు దేశమంతా విస్తరించింది. కాగా వొడాఫోన్ కూడా ఇప్పటికే ఇటువంటి ఆఫర్‌నే ప్రకటించింది. ఎంపిక చేసిన మెట్రోపాలిటిన్ నగరాల్లో 4జీ మొబైల్ కొన్న కొత్త వినియోగదారులకు 1జీబీ డాటా రేటుకే 10జీబీని అందిస్తున్న సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment