Monday, 31 October 2016

రోజుకో చాక్లెట్ తింటే అకాల మరణాలు తగ్గుతాయట!

పిల్లల నుంచి పెద్దల వరకూ చాక్లెట్లను ఇష్టపడని వారంటూ ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో! చాక్లెట్లు ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు తప్పవన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే ఈ అభిప్రాయం సరికాదు అంటున్నారు పరిశోధకులు. ప్రతిరోజూ ఒక చాక్లెట్‌ తినడం వలన గుండెజబ్బులు వచ్చే ప్రమాదం నుంచి 25 శాతం వరకూ తప్పించుకోవచ్చన్న విషయం వీరు నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. రక్తపోటును అదుపులో ఉంచడంతో పాటు వ్యాధినిరోధక శక్తిని చాక్లెట్‌ పెంచుతుందని వీరు స్పష్టం చేస్తున్నారు. రోజుకో చాక్లెట్‌ తినడం వలన 45 శాతం వరకూ అకాల మరణాలు తగ్గుతాయని అంటున్నారు అందువలన నిరభ్యంతరంగా రోజుకో చాక్లెట్‌ తినొచ్చని వీరు సూచిస్తున్నారు.

No comments:

Post a Comment