Monday, 31 October 2016

చెన్నైలో వెలుగుచూసిన బిర్యానీ బాగోతం !


తమిళనాడు రాజధానిలో క్యాట్ బిర్యానీ అమ్ముతున్నారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ గురించి తెలుసు కానీ ఈ క్యాట్ బిర్యానీ ఏంటని ఆశ్చర్యపోకండి. పిల్లులను చంపి వాటి మాంసంతో క్యాట్ బిర్యానీ తయారుచేసి వండివడ్డిస్తున్నారు. అందుకోసం, ఎవరికీ తెలియకుండా పిల్లులను ఓ బోనులో బంధించి ఉంచుతారు. ఈ అక్రమ బాగోతం పల్లవరంలో వెలుగుచూసింది. జంతు సంరక్షణకు చెందిన ఓ స్వచ్చంద సంస్థ వాలంటీర్లు, చెన్నై పోలీసులు సంయుక్తంగా ఈ అక్రమాన్ని బట్టబయలు చేశారు. పిల్లులను బోనులో నుంచి విడిపించారు. అయితే పిల్లుల ప్రవర్తనను చూసి వారంతా ఆశ్చర్యపోయారు. పిల్లుల సాధారణ ప్రవర్తనకు, ఆ పిల్లుల ప్రవర్తనకు సంబంధం లేదు.
గోడపై బల్లి పాకినట్లు ఎక్కుతున్నాయి. దూకుతున్నాయి. ఈ విషయంపై వాలంటీర్లు మాట్లాడుతూ ఎక్కువ రోజులు బోనులో ఉంచడం వల్ల వాటి మానసిక స్థితిలో మార్పు వచ్చిందని తెలిపారు. గత కొద్దిరోజులుగా పెంపుడు పిల్లులు కనిపించడం లేదని ఫిర్యాదులు అందాయని, విచారణ చేపట్టగా అసలు విషయం తెలిసిందని పోలీస్ అధికారి జి.వెంకటేషన్ తెలిపారు. అయితే చెన్నైలో క్యాట్ బిర్యానీ అమ్మడం కొత్తేమీ కాదని, గతంలో కూడా పలు హోటళ్లలో ఈ బాగోతం వెలుగుచూసిందని స్థానికులు పేర్కొంటున్నారు. పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది.

No comments:

Post a Comment