Friday, 21 October 2016

చరణ్‌ రిక్వెస్ట్‌ను పవన్‌ కాదంటాడా?



మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఓ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టి చాలా రోజులైంది. ఈ మధ్య అతని సినిమా లేవీ జనాలను ఆకట్టు కోవడం లేదు. ఆ కొరతను తన రాబోయే సినిమా ‘ధృవ’ తీరు స్తుందని చరణ్‌ కాన్ఫి డెంట్‌గా ఉన్నాడు. ఆ సినిమా ప్రమోషన్‌ను చరణ్‌ సీరియస్‌గా తీసుకుంటున్నాడట. అందుకే ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌కు బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ను ఆహ్వానించాలని అనుకుంటున్నాడట.
నిజానికి చరణ్‌ ఆడియో ఫంక్షన్‌లన్నింటికీ మెగాస్టారే చీఫ్‌ గెస్ట్‌. అయితే పవన్‌ చీఫ్‌ గెస్ట్‌గా హాజరైన చరణ్‌ సినిమాలు ‘మగధీర’, ‘నాయక్‌’ సూపర్‌ హిట్‌లుగా నిలిచాయి. ఆ సెంటిమెంట్‌తోనే ‘ధృవ’ ఫంక్షన్‌కు పవన్‌ను ఆహ్వానించాలని ప్లాన్‌ చేస్తున్నాడట. సాధారణంగా అయితే చరణ్‌ రిక్వెస్ట్‌ను పవన్‌ కాదనడు. కానీ, ‘ధృవ’ సినిమాకు నిర్మాత అల్లు అరవింద్‌. ఆయనతో పవన్‌ రిలేషన్‌ అంతంత మాత్రమే. ‘ప్రజారాజ్యం’ టైమ్‌ నుంచి వారి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. అరవిందే కాకుండా బన్నీ కూడా పవన్‌ కల్యాణ్‌ గురించి మాట్లాడను అని ప్రకటించి వివాదం రేపాడు. ఈ పరిణామాలన్నింటి మధ్య పవన్‌ ఈ ఆడియో ఫంక్షన్‌కు వస్తాడా అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

No comments:

Post a Comment