కొత్తదనం ఉన్న
కథల్ని. కొత్త ఆలోచనలతో వచ్చిన దర్శకుల్నీ భుజం తట్టి ప్రోత్సహిస్తుంటారు
నాగార్జున. ఆయన దృష్టిలో చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ ఉండదు. మంచి
సినిమా, చెడ్డ సినిమా అనే లెక్కలే ఉంటాయి. అందుకే చిన్న సినిమాలకూ ఆయన తనవంతు
సహాయం చేస్తుంటారు. అలాంటి సినిమాల్లో నటించడానికి ఉత్సాహం చూపిస్తుంటారు.
ఇప్పుడూ అలాంటి ప్రయత్నమే జరుగుతోందని టాలీవుడ్ టాక్. గతేడాది
వచ్చిన చిన్న చిత్రాల్లో ‘రాజుగారి గది’ కూడా మెరిసింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన
ఈ చిత్రం అందుకు నాలుగు రెట్లు లాభాల్ని సంపాదించింది. ఇప్పుడు ఈ చిత్రానికి
కొనసాగింపుగా ‘రాజు గారి గది 2’ వస్తోంది. ఇందులో ఓ కీలకమైన పాత్రలో
నాగార్జున కనిపిస్తారని సమాచారం. ఇది వరకు ఈ పాత్ర వెంకటేష్ చేస్తారని
చెప్పు కొన్నారు. అది చివరికి నాగార్జున చేతికి చిక్కినట్టు తెలుస్తోంది. హారర్
చిత్రంలో నటించడం నాగ్‌కి ఇదే ప్రధమం. ఇందుకు సంబంధించిన వివరాలు
త్వరలో వెల్లడవుతాయి.

No comments:
Post a Comment