Friday, 7 October 2016

ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్‌లో నెంబర్ వన్ ఏదో తెలిసిపోయింది!

పండగ సీజన్ వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది షాపింగ్. ఇది వరకు షాపింగ్ చేయాలంటే పనిగట్టుకుని షాపుకి వెళ్లి కొనుగోళ్లు చేసేవారు. అది చాలా శ్రమతో కూడుకున్న పని. అలాంటిదాన్ని సులభతరం చేయడానికి ఎన్నో ఆన్‌లైన్ రిటైల్ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతీ సంస్థ ఏదో ఒక ఆఫర్ పెట్టడం, డిస్కౌంట్లు ఇవ్వడం వంటివి చేసి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఆయా సంస్థల మధ్య పోటీలో ప్రధమ స్థానంలో నిలిచే రిటైల్ సంస్థ ఏదనే చర్చలు కూడా నడిచాయి. అయితే ఆ చర్చలకు ఫ్లిప్‌‌కార్ట్ సంస్థ పుల్‌స్టాప్ పెట్టింది.
 
దసరా సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తాము ప్రకటించిన బిగ్ బిలియన్ డేస్ ఫెస్టివల్ అమ్మకాల్లో ఎక్కువ యూనిట్లను విక్రయించి దేశీయ ఆన్ లైన్ మార్కెట‌్‌లో ప్రధమ స్థానంలో నిలిచినట్టు వెల్లడించింది. బిగ్ బిలియన్ డే పేరిట అక్టోబర్ 2 నుంచి 6వ తేదీ వరకు 15.5 మిలియన్ యూనిట్లను విక్రయించినట్టు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ లు తెలిపారు. దీనికి స్మార్ట్ ఫోన్లు, టెలివిజన్ విక్రయాలు ఎక్కువగా సహకరించినట్టు వారు చెప్పారు. అయితే అంతకు ముందు రోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ పేరేతో 15 మిలియన్ యూనిట్ల విక్రయాలు చేసినట్లు ప్రకటించింది.

No comments:

Post a Comment