వేములవాడలోని
శ్రీరాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో కార్తీక సందడి ప్రారంభమైంది.
తెలంగాణాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని
వేములవాడ ఆలయం కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది.
వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు
ఆచరించారు. శ్రీస్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడెమొక్కు
చెల్లించుకున్నారు. అనంతరం ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం క్యూలైన్ల మీదుగా
శ్రీస్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక సోమవారం
సందర్భంగా శ్రీరాజరాజేశ్వరస్వామివారికి ఆలయ అర్చకులు ఉదయం మహాన్యాసపూర్వక
రుద్రాభిషేకం, సాయంత్రం మహాలింగార్చన ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో దూస
రాజేశ్వర్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
No comments:
Post a Comment