Friday, 21 October 2016

రానా మెడకు చుట్టుకుంటున్న ‘రమ్మీ’!

బాహుబలి విలన్‌పై కేసు నమోదైంది. సినిమాలో ప్రతినాయకుడి పాత్ర భల్లాలదేవుడిగా కనిపించిన దగ్గుబాటి రానాపై ఓ వ్యక్తి కేసు వేశాడు. మరి అతడిపై కేసు ఎందుకు నమోదైనట్టు అనేనా డౌటు. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండే రానా ఇప్పుడు ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. దానికి కారణం ‘రమ్మీ’. ఆ రమ్మీ(పేకాట)ని ప్రోత్సహించేలా రానా ప్రకటనలు చేస్తున్నాడంటూ తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన పి.ఇళగోవన్ అనే సామాజిక కార్యకర్త కేసు వేశాడు. రానాతో పాటు ప్రకాష్ రాజ్‌పైనా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘‘రానా, ప్రకాష్ రాజ్‌లు పలు వెబ్ సైట్ల ద్వారా గాంబ్లింగ్‌ను ప్రమోట్ చేస్తున్నారు. రమ్మీ ఆడేందుకు పురిగొల్పేలా ప్రకటనలు ఇస్తున్నారు. టీవీల్లోనూ అవి ప్రసారం అవుతున్నాయి. వీరు ప్రచారం చేసే సైట్ సహా పలు వెబ్‌సైట్లు కూడా బెట్టింగ్‌కు పురిగొల్పుతున్నాయి’’ అంటూ కోయంబత్తూర్ కమిషనర్‌కు ఇళగోవన్ ఫిర్యాదు చేశాడు. కాగా, బెట్టింగ్, రమ్మీ, గాంబ్లింగ్‌లపై నిషేధం ఉండడంతో ఇళగోవన్ ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దీంతో భల్లాల దేవుడికి తిప్పలు తప్పేలా లేవు.

No comments:

Post a Comment