అమెరికాను వణికిస్తున్న మాథ్యూ హరికేన్
హైతీలో
283మంది మృతి
అత్యవసరస్థితి
ప్రకటించిన ఒబామా
జాక్సోన్‌విల్లే:
పెనుతుపాను ‘మాథ్యూ’ దెబ్బకు
అమెరికాలోని ఫ్లోరిడా చిగురుటాకులా
వణికిపోతోంది. హైతీలో మాథ్యూ
హరికేన్ వల్ల ఇప్పటికే 283 మంది
ప్రాణాలు కోల్పోవడంతో అమెరికా
భయపడుతోంది. ఈ పెనుతుపాను ఇప్పుడు
ఫ్లోరిడా తీరాన్ని తాకడంతో
అగ్రరాజ్యం ప్రాణనష్టం వాటిల్లకుండా
ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.
అమెరికా అధ్యక్షుడు బరాక్
ఒబామా ఇప్పటికే ఫ్లోరిడా, జార్జియాలో
అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
హరికేన్.. పెనుగాలులు, భారీ
వర్షాలతో బీభత్సం సృష్టించే
అవకాశం ఉన్నందున లక్షలాది మంది
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు
తరలిస్తున్నారు. మ్యాథ్యూ హరికేన్
ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని
అధికారులు ప్రజలను హెచ్చరిస్తూ
ప్రమాదక ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు.
సహాయక బృందాలు రంగంలోకి దిగి
సహాయకచర్యలు చేపడుతున్నారు.
పెను
తుపాను మనుషులను చంపేస్తుంది,
చాలా సీరియస్, ఇక్కడి నుంచి
వెళ్లిపోవాలంటూ అధికారులు
ప్రజలను తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
ఇది నాలుగో కేటగిరీ హరికేన్
అని అధికారులు తెలిపారు. దశాబ్ద
కాలంలో కరేబియన్ ప్రాంతంలో
సంభవించిన తుఫానుల్లో ఇదే అత్యంత
తీవ్రమైనదని అధికారులు చెప్తున్నారు.
అమెరికా ఆగ్నేయ రాష్ట్రాలు
ఫ్లోరిడా నుంచి నార్త్‌కెరోలినా
వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు
సూచించారు. ఎమర్జెన్సీ ప్రకటించారు.
స్కూళ్లు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.
కొన్ని చోట్ల విమాన సర్వీసులు
కూడా రద్దు చేశారు. మాథ్యూ తీవ్రతను
తెలియజేస్తూ వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు
ప్రజలను అప్రమత్తం చేస్తోంది.
దాదాపు 25లక్షల మంది ప్రజలు సురక్షిత
ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు
తెలిపారు. ఫ్లోరిడా మీదుగా వెళ్లాల్సిన
దాదాపు 2800 విమానాలను రద్దు చేశారు.
గంటకు 230కిలోమీటర్ల వేగంతో గాలలు
వీస్తాయని అంచనావేస్తున్నారు.
హైతీలో
ఈ పెనుతుపాను తీవ్ర ప్రాణనష్టం,
ఆస్తినష్టం కలిగించింది. జెరెమీ
నగరంలో దాదాపు 30వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి.
సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఒక్క రోచ్ ఎ బాట్యూ నగరంలోనే
50 మంది చనిపోయారు. ఈ తుపాను ప్రభావం
హైతీ, క్యూబాలతో పాటు బహమాస్‌పై
కూడా పడింది. భారీ వేగంతో వీచే
గాలుల కారణంగా పెద్ద ఎత్తున
చెట్లు, విద్యుత్ స్తంభాలు
నేలకొరిగాయి. అయితే ప్రాణనష్టం
ఎక్కువగా హైతీలోనే జరిగింది.
తీరప్రాంతంలోని మత్స్యకార
గ్రామాలో ఎక్కువ మంది ప్రాణాలు
కోల్పోయారు. విద్యుత్, టెలిఫోన్,
రవాణా వ్యవస్థలు దెబ్బతినడంతో
పాటు ఆహరం లేక ప్రజలు అల్లాడిపోతున్నారు.
No comments:
Post a Comment