Friday, 7 October 2016

ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో..నెగిటివ్‌ గ్రూప్‌ రక్తం కొరత

గాంధీ ఆస్పత్రిలో ప్రసవవేదన పడుతున్న ఓ గర్భిణికి రక్తం అవసరమైంది. ఆమె గ్రూప్‌రేర్‌కు సంబంధించి కావడంతో ఆస్పత్రిలో అందుబాటులో లేదు. దీంతో కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఉరుకుల పరుగుల మీద నగరంమొత్తం గాలిం చారు. చివరకు రక్తంసేకరించి ఆస్పత్రి వైద్యులకు అందజేశారు. సకాలంలో రక్తం లభించడంతో రోగిప్రాణాలు కాపాడ గలిగారు. గాంధీలోనే కాదు... ఉస్మానియాలోనూ ఇదే పరిస్థితి.ఆంధ్రజ్యోతి,హైదరాబాద్‌ సిటీ: గాంధీ, ఉస్మాని యా ఆస్పత్రుల్లో ఒకరు రక్తం ఇస్తేగానీ రోగికి ఎక్కిం చలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ ఆస్పత్రుల్లో అడ్మిట్‌ రోగికి రక్తం అవసరమైతే ముందుకుగా కుటుంబసభ్యులు, బంధు వులు, మిత్రులుకానీ రక్తం ఇవ్వాల్సిన దుస్థితి.
నెగిటివ్‌ బ్లడ్‌ దొరకడం కష్టమే....
ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ప్రధానంగా నెగిటివ్‌ బ్లడ్‌ దొరకడం కష్టంగా మారింది. ఎ నెగిటివ్‌, బి నెగిటివ్‌, ఓ నెగిటివ్‌ గ్రూపులకు సంబంధించిన రక్తం ఉస్మానియాలో దాదాపు అందుబాటులో లేదు. ఈ గ్రూపు రక్తం కావాలంటే రోగుల బంధువులు బయటకు పరుగులు తీయాల్సిందే. బి నెటిటివ్‌ కావా లంటే ముందుగానే రిజర్వు చేసుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే నలుగురు బి నెగిటివ్‌కోసం బాధితులు పేర్లను నమోదుచేసుకుని సిద్ధంగాఉన్నట్లు తెలిసింది.
అవసరం మేరకు లేదు
ప్రతినెలా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు 500 నుంచి 600 యూనిట్ల రక్తం అవసరమవుతోంది. కానీ ఆ మేరకు నిల్వ ఉండడం లేదు. ఇక ఇక్కడ ఓ నెగిటివ్‌, ఏబీ నెగిటివ్‌ రక్తం నలుగురికి సరిపో యేంత ఉంది. దీంతో రోగులు రక్తంకావాలంటే నానా తంటాలు పడాల్సిందే. ఉస్మానియాలో ప్రతిరోజూ 40 మందికి రక్తం అవసరమైతే 10 మంది మాత్రం దానం చేస్తున్నారని వైద్యులు తెలిపారు. అవసర మైతే ఐపీఎం నుంచి తెప్పించుకుంటున్నామని వైద్యులు తెలిపారు.
50- 60 బ్యాగ్‌ల రక్తం కొనుగోలు
విపత్కరపరిస్థితుల్లో రక్తంకోసం రోగులు, బంధు వులు పడే ఆందోళన అంతా ఇంతా కాదు. ప్రైవేట్‌ బ్లడ్‌బ్యాంకుల నిర్లక్ష్యం, రీప్లేస్‌మెంట్‌రక్తం లభించక పోవడం, సకాలంలో దాతలుఅందుబాటులో లేకపోతే రోగి కుటుంబసభ్యులు తల్లడిల్లాల్సిందే. ఈ ఆస్పత్రు ల్లో ప్రతినెలా 50 నుంచి 60 బ్యాగ్‌ల రక్తాన్ని రోగులు బయట నుంచి కొని తెచ్చుకుంటున్నారు.
ఒకరు దానం చేస్తేనే రక్తం సరఫరా....
ఈ ఆస్పత్రుల్లో రోగికిరక్తం కావాలంటే మరొకరు రక్తాన్ని దానంచేయాల్సిందే... రోగులకు రక్తం అవసరమైన సమయంలో వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి రక్తాన్ని ఇవ్వాల్సి వస్తోంది. చాలా మంది కుటుంబ సభ్యులు రక్తాన్ని ఇవ్వడానికి ముందుకు రావడంలేదని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. ఎవరూ రక్తదానం చేయకపోతే రోగి బంధువులు ప్రైవేట్‌బ్లడ్‌ బ్యాంకులకెళ్లి కొనుగోలు చేయాల్సిందే.
పట్టించుకోని ప్రైవేట్‌ బ్లడ్‌ బ్యాంకులు
నిబంధనల ప్రకారం ప్రైవేట్‌ బ్లడ్‌ బ్యాంకులు ఉస్మా నియా, గాంధీ ఆస్పత్రులకు రక్తం సరఫరా చేయాలి. వైద్యశిబిరాల ద్వారా సేకరించిన రక్తం నుంచి 30 శాతం మేరకు రక్తాన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు తప్పని సరిగ్గా ఇవ్వాల్సిందే. అయితే అవి అవసరమైన రక్తాన్ని సరఫరాచేయడం లేదని సమాచారం. ప్రైవేట్‌ బ్లడ్‌బ్యాంకుల్లో ఎక్కువగా అవసరంలేని గ్రూపుల రక్తాన్నే సరఫరా చేస్తున్నట్లు వైద్యులు వివరించారు.
నారాయణ బ్లడ్‌ బ్యాంకే దిక్కు..
వివిధ జిల్లా నుంచి వచ్చిన రోగుల బంధువులు రక్తంకోసం నారాయణబ్లడ్‌బ్యాంక్‌ను ఆశ్రయి స్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా పెద్దాస్పత్రిలో వైద్యం దొరకుతుందని వచ్చిన నిరుపేదలకు నారాయణబ్లడ్‌బ్యాంకే దిక్కవు తోంది. వైద్యులుసూచనతో ఈ బ్లడ్‌ బ్యాంక్‌కు రోగుల బంధువులు పరుగులు తీస్తున్నారు.

No comments:

Post a Comment