Thursday, 6 October 2016

జాగ్వార్ : రివ్యూ




రేటింగ్‌: 2.5/5
 
నిర్మాణ సంస్థ: చన్నాంభిక ఫిలింస్
సమర్పణ: హెచ్‌.డి. కుమారస్వామి
తారాగణం: నిఖిల్ కుమార్, దీప్తి సేథీ, జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్‌, ఆదిత్యమీనన్‌, భజ్రంగ్‌ లోకేష్‌, అవినాష్‌, వినాయక్‌ జోషి, ప్రశాంత్‌, సుప్రీత్‌ రెడ్డి, రావు రమేష్‌, రమ్యకృష్ణ తదితరులు
కథ: విజయేంద్ర ప్రసాద్‌
చాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస
సంగీతం: యస్‌.యస్‌. థమన్‌
ఎడిటింగ్: రూబిన్
ఆర్ట్‌: నారాయణరెడ్డి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
ఫైట్స్‌: రవివర్మ, రామ్‌-లక్ష్మణ్‌, కలోయాన్‌ (బల్గేరియా), సెల్వ
నిర్మాత: శ్రీమతి అనితా కుమారస్వామి
స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: ఎ. మహదేవ్‌.
ప్రధాని దేవగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడుగా నిఖిల్‌కుమార్‌ ‘జాగ్వార్‌’ చిత్రం ద్వారా ఇటు తెలుగు, అటు కన్నడ సినిమా రంగానికి పరిచయమైయ్యారు. మంచి బ్యాక్ గ్రౌండ్ ఉండటంతో నిఖిల్ ఎంట్రీ కూడా భారీగా జరిగింది. సినిమాను భారీగా రూపొందించారు...సరే మరి నిఖిల్ కుమార్ నటన ఎలా ఉంది, సినిమా నిఖిల్‌కు బ్రేక్ ఇస్తుందా అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం...
కథ:
ఎస్‌.ఎస్‌.టీవీ చానెల్‌లో జడ్జి(రవి కాలే) హత్య లైవ్‌ టెలికాస్ట్‌ కావడంతో ప్రజలందరితో పాటు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అటెన్షన్‌కు గురవుతుంది. చానెల్ టి.ఆర్.పి రేటింగ్ పెరుగుతుంది. పోలీసులు హంతుకుడిని పట్టుకోవాలని ప్రయత్నించినా అతను తప్పించుకుని పారిపోతాడు. హత్య కేసును స్పెషల్ కేసుగా భావించి, డీల్‌ చేయమని సిబిఐ ఆఫీసర్‌(జగపతిబాబు)కు అప్పగిస్తారు. జగపతిబాబు కేసుకు, హంతకుడికి జాగ్వార్‌ అని పేరు పెట్టి దర్యాప్తు ప్రారంభిస్తాడు. కథ ఇలా సాగుతుండగా, సిటీలోనే పెద్ద కార్పొరేట్‌ హాస్పిటల్‌ శాంతి మెడికల్‌ కాలేజ్‌కు ఛైర్మన్‌(ఆదిత్య మీనన్‌)గా ఉంటాడు. ఇతనితో పాటు ఎస్‌.ఎస్‌ చానెల్‌ అధినేత శౌర్య ప్రసాద్‌ కూడా శాంతి మెడికల్‌ కాలేజ్‌లో పార్ట్‌‌నర్‌గా ఉంటాడు. శాంతి మెడికల్‌ కాలేజ్‌లో ఎస్‌.ఎస్‌.కృష్ణ(నిఖిల్‌కుమార్‌) ఎం.బి.బి.ఎస్‌ మొదటి సంవత్సరంలో జాయిన్‌ అవుతాడు. ఆ కాలేజ్‌లో యువకులందరికీ లీడర్‌గా ఉన్న ఆర్య(ఆదర్శ్‌) చెల్లెలు ప్రియా(దీప్తి సేథీ)ని నిఖిల్‌ ప్రేమిస్తాడు. ప్రియా కూడా నిఖిల్‌ను ప్రేమిస్తుంది. హాస్పిటల్‌లోని డబ్బుకోసం జరుగుతున్న అన్యాయాలను చూసిన ఆర్య మేనేజ్‌‌మెంట్‌కు ఎదురుతిరిగి ధర్నా చేస్తాడు. ధర్నాను ఆపడానికి వచ్చిన ఎన్‌కౌంటర్‌ శంకర్‌(సుప్రీత్‌)ను జాగ్వార్‌ చంపేస్తాడు. హత్యా స్థలానికి చేరుకున్న సిబిఐ ఆఫీసర్‌ ఫోన్‌కు ఓ మెసేజ్ వస్తుంది. చేసిన హత్యలతో పాటు కృష్ణ, ఎస్‌.ఎస్‌. చానెల్‌ అధినేత, శాంతి మెడికల్‌కాలేజ్‌ ఛైర్మన్‌, అతని కొడుకు అజయ్‌ను కూడా చంపేస్తానని ఆర్య ఫోన్‌ నుండి అందరికీ ఎం.ఎం.ఎస్‌ వస్తుంది. దాంతో అందరూ ఆర్యనే జాగ్వార్‌గా అందరినీ చంపుతున్నాడని అనుకుంటారు. కానీ కథ మలుపు తిరుగుతుంది. కృష్ణను, ఆర్య ఎందుకు చంపాలనుకుంటాడు? అసలు రామచంద్రయ్య ఎవరు? రామచంద్రయ్య, ఆర్య, కృష్ణ మధ్య రిలేషన్‌ ఏంటి? అసలు జాగ్వార్‌ హత్యలెందుకు చేస్తున్నాడు? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే....
ప్లస్‌ పాయింట్స్‌:
- సినిమాటోగ్రఫీ
- మేకింగ్‌ వాల్యూస్‌
- బ్యాక్‌ గ్రౌండ్‌స్కోర్‌
- హీరో నటన, డ్యాన్సులు, ఫైట్స్‌
మైనస్‌ పాయింట్స్‌:
- కథలో కొత్తదనం లేకపోవడం
- సంగీతం
విశ్లేషణ:
ఈ సినిమాలో హీరో నిఖిల్‌కుమార్‌ కొత్తవాడైనా నటన పరంగా పరావాలేదనిపించాడు. డ్యాన్సులు, ఫైట్స్‌ పరంగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌ దీప్తి సేథీ తనపాత్రకు న్యాయం చేసింది. సిబిఐ ఆఫీసర్‌గా రగ్డ్‌ లుక్‌తో జగపతిబాబు నటన బావుంది. జగపతిబాబు సింపుల్‌గానే తన పాత్రలో ఒదిగిపోయాడు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంపత్‌నంది, ఆదిత్యమీనన్‌ల గురించే...ఇలాంటి విలనీజాలను వీరు చాలా చిత్రాల్లో చేసుండటం వల్ల జాగ్వార్‌లో విలనీజంలో కొత్తగా కష్టపడిందేమీ లేదు. పాపులారిటీ పద్మనాభంగా బ్రహ్మానందం నవ్వించాలనే ప్రయత్నం పెద్దగా సక్సెస్ కాలేదు. రమ్యకృష్ణ చిన్న పాత్రలో కనపడి మెప్పించింది. హీరోయిన్‌ కేవలం పాటలకు మాత్రమే పరిమితమైపోయింది. దీప్తి పాత్రకు పెద్ద ఇంపార్టెన్స్‌ కనపడదు. కార్పొరేట్‌ హాస్పిటల్స్‌‌లో జరిగే వైద్యం అనే పాయింట్‌తో పాటు, ఒక మెట్టు ఎక్కడానికి పదిమందికి మొక్కడానికైనా, వందమందిని తొక్కడానికైనా నేను రెడీ..అనే లైన్‌ బేస్‌ చేసుకుని విజయేంద్రప్రసాద్‌ కథను రాసుకున్నాడు. కథలో కొత్తదనం లేకపోవడం ప్రేక్షకుడికి నిరాశను కలిగిస్తుంది. అయితే మంచి టీం సపోర్ట్‌ తో సినిమాకు ఓ గ్రాండియర్‌ వచ్చింది. ముఖ్యంగా మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్‌. ప్రతి ఫ్రేమ్‌లో రిచ్‌నెస్‌ కనపడింది. ముఖ్యంగా యాక్షన్‌ పార్ట్‌‌ను తనదైన సినిమాటోగ్రఫీతో మనోజ్‌ తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు. చిన్నా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంది. రూబిన్‌ ఎడిటింగ్‌ పరావాలేదు. కమర్షియల్‌ సినిమాకు తగిన విధంగా ఎడిటింగ్‌ వర్క్‌ స్రీన్‌పై కనపడుతుంది. తమన్నా స్పెషల్‌సాంగ్‌ బావుంది. థమన్ ట్యూన్‌ ఆకట్టుకోకపోయినా తమన్నా చమక్కులు అభిమానులను అలరిస్తుంది. థమన్‌ ట్యూన్స్‌ గందరగోళంగా ఉన్నాయి. అయితే చిన్నా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు వెన్నుదన్నుగా నిలిచింది. మేకింగ్‌ వాల్యూస్‌ సూపర్బ్‌. బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్‌ వంటి చిత్రాలకు కథను అందించిన విజయేంద్రప్రసాద్‌ వంటి రచయిత ఇలాంటి కథను అందించాడా అనే సందేహం కూడా సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది.
బోటమ్‌ లైన్‌: జాగ్వార్‌..రొటీన్‌ కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌

No comments:

Post a Comment