Wednesday, 19 October 2016

అందుకే బాలయ్య పేరు ముందు ‘నందమూరి’ పెట్టలేదట!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాతికి విడుదల కానుంది. ఇటీవల జరగిన దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌లను విడుదల చేశారు. టీజర్‌లో బాలకృష్ణ పేరుకు ముందు నందమూరి అని ఉండదు. నిజానికి బాలయ్యకు తన ఇంటి పేరు అంటే ఎంతో ఇష్టం. కానీ, ఈ సినిమాకు మాత్రం తన పేరుకు ముందు నందమూరి అని వేసుకోలేదు.
దీని వెనుక ఆసక్తికరమైన కారణముందంటున్నాడు దర్శకుడు క్రిష్‌. ‘పూర్వం వ్యక్తుల పేర్లకు ముందు తండ్రుల పేర్లే ఉండేవి. అది చాలా హీనం అని భావించాడు శాతకర్ణి. అలాంటి కరుడుగట్టిన పితృస్వామ్య రోజుల్లో కూడా తన తల్లి పేరైన గౌతమిని తన పేరుకు ముందు పెట్టుకుని ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అని పిలిపించుకున్నాడు. ఆ నియమాన్నే పాటిస్తూ మేము కూడా ‘బసవతారకపుత్ర బాలకృష్ణ’, ‘అంజనీపుత్ర క్రిష్‌’ అని వేయించామన్నా’డు. ఓ కొడుకు తండ్రి కంటే గొప్పవాడు కాగలడేమో గాని, తల్లి కంటే మాత్రం గొప్పవాడు కాలేడని క్రిష్‌ అన్నాడు.

No comments:

Post a Comment