Sunday, 11 September 2016

ఫ్లిప్‌కార్ట్‌లో 10,000 మంది తాత్కాలిక ఉద్యోగులు

ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ పండుగల సీజన్‌లో కస్టమర్లకు వేగంగా సేవలు అందించేందుకు తాత్కాలికంగా దాదాపు 10,000 మంది కొత్త ఉద్యోగులను డెలివరీ, రవాణ సౌకర్యాల కోసం నియమించుకుంటోంది. వచ్చే సీజన్‌లో భారీగా ఆఫర్లు ప్రకటించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు ఆన్‌లైన్‌ విక్రయ సంస్థలు కూడా వచ్చే పండుగల సీజన్‌కు సిద్ధమవుతున్నాయి.
దీనిపై ఫ్లిప్‌కార్ట్‌ ఆడ్మిన్‌స్ట్రేటీవ్‌ ఆఫీసర్‌ నితిన్‌సేట్‌ మాట్లాడుతూ ‘‘ పండుగల సీజన్‌లో బిగ్‌బిలియన్‌ సేల్స్‌ గతం కంటే ఈ సారి మరింత భారీగా, విస్తృతంగా ఉండవచ్చు.. దీంతో పలు మార్గాల్లో మా డెలివరీ సామర్థ్యాలను పెంచుకుంటున్నాం. కొత్తగా 10,000 మందిని నియమించుకుంటున్నాం. దీంతో దేశం చివరి భాగం వరకు మా రవాణ వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నాం’’ అన్నారు.

No comments:

Post a Comment