Sunday, 11 September 2016

షాపింగ్‌ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్‌ కార్ఖానా ప్రాంతంలోని ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పూజా ప్లాజా భవనంలో ఉన్న నాలుగు వస్త్ర దుకాణాలు, చెప్పుల దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. మూడు అగ్ని మాపక శకటాలతో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. భవనం నుంచి భారీగా పొగలు రావడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

No comments:

Post a Comment