Sunday, 11 September 2016

బెస్ట్‌ సింగర్‌ పవనా.. నేనా?

రామ్‌గోపాల్‌ వర్మ
క్రియేటీవ్‌ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెలుగులో తెరకెక్కిస్తున్న చిత్రం ‘వంగవీటి’. ఈ సినిమాలో ‘చంపరా’ అనే భజన పాటను వర్మ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. మరో విషయమేమిటంటే.. ఈ పాట పాడింది కూడా వర్మనే. ఇక ఛాన్స్‌ దొరికితే సెలబ్రెటీలపై ఏదో ఒక కామెంట్‌ చేసే వర్మ ఈ పాటతో పవన్‌కల్యాణ్‌పై కామెంట్స్‌ చేశారు. శుక్రవారం పవన్‌కళ్యాణ్‌ జనసేన బహిరంగ సభలో మాట్లాడిన సంగతి తెలిసిందే. సభలో ప్రసంగిస్తూ మధ్యలో పవన్‌ ఓ పాట పాడారు. ‘‘పవన్‌ సభలో పాడిన పాట బాగుందా.. లేక నేను వంగవీటి చిత్రంలో పాడిన ‘చంపరా’ పాట బాగుందా. మహేశ్‌ బాబు, ఎన్టీఆర్‌, ప్రభాస్‌, పవన్‌ కల్యాణ్‌ అభిమానుల్లారా.. మా ఇద్దరిలో ఎవరి పాట బాగుందో మీరే చెప్పండి. మా ఇద్దరి పాటల గురించి మ్యూజిక్‌ డైరక్టర్లు దేవీశ్రీ ప్రసాద్‌, ఎస్‌ఎస్‌ థమన్‌లను అడగాల్సిందిగా మీడియాను కోరుతున్నాను.’’ అంటూ వర్మ ట్వీట్ల ద్వారా పవన్‌ కల్యాణ్‌పై కామెంట్స్‌ విసిరారు.

No comments:

Post a Comment