న్యూఢిల్లీ: తొలిసారి
పాక్‌పై భారత్ దాడి చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై
దాడి చేసినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఈ విషయాన్ని ఆర్మీ ఆపరేషన్స్
డైరెక్టర్ జనరల్ రణ్‌బీర్ భారత విదేశాంగ రక్షణశాఖ సంయుక్త మీడియా సమావేశంలో
అధికారికంగా ప్రకటించారు. ఉరీలో ఉగ్రదాడుల తర్వాత పాకిస్థాన్ పట్ల భారత్
తన వైఖరి పూర్తిగా మార్చుకుంది.
పాక్
ఆక్రమిత కశ్మీర్‌పై గత రాత్రి దాడి చేశామని, దాడిలో పలువురు ఉగ్రవాదులు
చనిపోయారని ఆయన చెప్పారు. ఆ దాడుల్లో పాక్ సైనికులు కూడా చనిపోయారని,
ప్రస్తుతానికి దాడులు ఆపేశామని, ఇప్పట్లో దాడులు చేసే ఉద్దేశం లేదని
రణ్‌బీర్ ప్రకటించారు. దాడి తర్వాత పాకిస్తాన్‌కు సమాచారం అందించామని,
కాకపోతే అటు వైపు ఏం జరుగుతోందో తమకు సమాచారం లేదని జనరల్ తెలిపారు.
‘‘పాక్
వైపు నుంచి 20 చొరబాట్లను అడ్డుకున్నాం. పాకిస్తాన్ పదే పదే కాల్పుల
విరమణను ఉల్లంఘిస్తోంది. ఉగ్రవాదులు మెట్రో నగరాలపై దాడులకు కుట్రపన్నారు.
యూరీ ఉగ్రవాదుల వేలిముద్రలు, సమాచారాన్ని పాక్‌కు పంపాం. మా అభ్యంతరాలను
పాక్ జనరల్‌కు వివరించాం’’ అని రక్షణ శాఖ పేర్కొంది.

No comments:
Post a Comment