గత కొన్ని
రోజులుగా ధరలు పెరిగి రూ. 31వేల మార్కును దాటిన బంగారం ధర కాస్త దిగొచ్చింది.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో ధర తగ్గి రెండు వారాల కనిష్ఠానికి చేరింది.
శుక్రవారం రూ. 70 తగ్గడంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర
రూ. 31వేలుగా ఉంది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో ధరలు
తగ్గినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. సింగపూర్ మార్కెట్లో ఔన్సు
బంగారం ధర 1,313.10 అమెరికన్ డాలర్లుగా ఉంది.
వెండి కూడా బంగారం దారిలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో రూ. 350 తగ్గింది. దీంతో దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 45,100గా ఉంది.
వెండి కూడా బంగారం దారిలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో రూ. 350 తగ్గింది. దీంతో దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 45,100గా ఉంది.

No comments:
Post a Comment