Thursday, 15 September 2016

రికార్డు బద్దలు కొట్టిన బాలాపూర్ లడ్డూ!

 బాలాపూర్ లడ్డూ గతేడాది రికార్డును బద్దలు కొడుతూ వేలం పాటలో రూ.14.65 లక్షలు పలికింది. లడ్డూ కోసం అనేక మంది ప్రముఖులు పోటీ పడగా కీసర వాస్తవ్యులు స్కైలా‌బ్‌రెడ్డి లడ్డూను సొంతం చేసుకున్నారు. మన్యం బలవంత్‌రెడ్డి, స్కైలాబ్‌రెడ్డి మధ్య వేలం ఉత్కంఠంగా సాగింది. చివరకు స్కైలాబ్‌రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. మొత్తంగా గతేడాది కంటే రూ.4.33లక్షలు అధికంగా లడ్డూకు వచ్చాయి. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి లడ్డూ ధరను రూ.1,116గా నిర్ణయించగా వేలంలో రూ.14.65 లక్షల రికార్డు ధర పలికింది. లడ్డూను సొంతం చేసుకున్న స్కైలాబ్‌రెడ్డిని ఉత్సవ సమితి సభ్యులు సన్మానించి బాలాపూర్ లడ్డూను అందజేశారు. అనంతరం సమితి అధ్యక్షుడికి స్కైలాబ్‌రెడ్డి నగదును అందజేశారు. గతేడాది బాలాపూర్ లడ్డూ రూ.10.32 లక్షలు పలికిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment