ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల
శివ దర్శకత్వంలో విడుదలైన ‘జనతా
గ్యారేజ్’ చిత్రం అమెరికాలో
చక్కటి వసూళ్లను రాబడుతోంది.
సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు
వచ్చిన ఈ చిత్రం శనివారానికి
మొత్తం 1.8 మిలియన్ డాలర్లు వసూలు
చేసినట్లు సినీ విశ్లేషకుడు
తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్
ఖాతా ద్వారా తెలిపారు. మూడోవారంలో
శుక్రవారం (5,629 డాలర్లు), శనివారం
(14,824 డాలర్లు) మొత్తం వసూళ్లు
1,777,542 డాలర్లు (రూ. 11.92 కోట్లు) రాబట్టినట్లు
ట్వీట్ చేశారు.
సమంత, నిత్యా మేనన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించారు. మలయాళ నటుడు మోహన్‌లాల్ చిత్రంలో కీలక పాత్రను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.
సమంత, నిత్యా మేనన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించారు. మలయాళ నటుడు మోహన్‌లాల్ చిత్రంలో కీలక పాత్రను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

No comments:
Post a Comment