Saturday, 17 September 2016

స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ ఉపయోగిస్తే నష్టం లేదట..లాభమేనట

స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ ఉపయోగించడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అంటున్నారు పరిశోధకులు. వీటిని ఎక్కువగా ఉపయోగించేవారు మిగతా వారికన్నా ఎక్కువ చురుకుగా, ఆరోగ్యంగా ఉంటారనీ, బరువు కూడా తగ్గుతారన్న విషయం పరిశోధనల్లో వెల్లడైంది. పై రెండింటి వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందన్న విషయం గతంలో నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైనప్పటికీ తాజా పరిశోధనలు అవి ఆరోగ్యానికి మేలే చేస్తాయి తప్ప హాని చేయవు అని నిర్ధారించాయి. సుమారు 25 సంవత్సరాల పాటు 224 మంది మీద ఈ పరిశోధనలు నిర్వహించారు. వీరిలో అధికబరువు క్రమేపీ తగ్గడమే కాకుండా క్రానిక్‌ డిసీజ్‌ కనిపించలేదు. స్మార్ట్‌ఫోను, ఇంటర్నెట్‌ ఉపయోగించేవారు మిగతా వారికన్నా చురుకుగా వ్యవహరించడం, చురుకుగా ఆలోచించడాన్ని పరిశోధకులు గుర్తిం చారు. వీరిలో ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు కూడా తగ్గుముఖం పట్టడం గమనించారు.

No comments:

Post a Comment