జంగారెడ్డిగూడెం:-
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం
మండలం అయ్యవారి పోలవరం గ్రామ
సమీపంలోని యర్రకాల్వ జలాశయంలో
అరుదైన నల్లత్రాచు దొరికింది.
యర్రకాలువలో చేపల వేటకు వెళ్లిన
మత్స్యకారుల వలలో నల్లత్రాచు
పాము పడింది. దీంతో కంగారుపడిన
మత్స్యకారులు దానిని చంపకుండా
గ్రామానికి తీసుకొచ్చారు. దాదాపు
9అడుగుల పొడవున్న పామును చూసేందుకు
ప్రజలు భారీగా తరలివచ్చారు.
దానిని యువకులు తమ సెల్‌ఫోన్లలో
చిత్రీకరించారు. అంతరించిపోతున్న
పాములను రక్షించాలన్న ఉద్దేశంతో
దానిని చంపకుండా జాగ్రత్తగా
అడవిలో విడిచిపెట్టారు. వలలో
బందీగా ఉన్నప్పుడు నల్లత్రాచు
కొట్టిన బుసలను అందరూ ఆసక్తిగా
తిలకించారు.

No comments:
Post a Comment