బుల్లితెరపై ప్రేక్షకాదరణ
పొందిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’
కార్యక్రమానికి వ్యాఖ్యాతగా
నాగార్జున బదులు చిరంజీవి వ్యవహరించనున్న
సంగతి తెలిసిందే. ‘ఓం నమో వేంకటేశాయ’
చిత్రంతోపాటు తన కుమారుల సినిమా
పనుల్లో నాగార్జున బిజీగా ఉన్నారు.
దీంతో నాలుగో సీజన్‌ను నిర్వాహకులు
చిరంజీవితో చేయిస్తున్నారు.
అయితే తాజాగా ఈ సీజన్‌కు సంబంధించిన
ఒక టీజర్‌ను విడుదల చేశారు.
‘మీ హృదయాన్ని కొల్లగొట్టినవాడు..
మీతో కోటి గెలిపించడానికి వస్తున్నాడు’
అంటూ ఈ వీడియోలో చిరంజీవిని
ఆసక్తిగా చూపించారు.
మెగాస్టార్ ప్రస్తుతం వి.వి. వినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నంబరు 150’ చిత్రంలో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ చిత్రంలో కథానాయికగా పాత్రను పోషిస్తున్నారు.

No comments:
Post a Comment