దూకుడు సినిమాలో యంగ్
ఎమ్మల్యేగా కనిపించి అలరించాడు ప్రిన్స్ మహేశ్ బాబు. ఆ తర్వాత కొన్ని
పరాజయాలు పలకరించినా కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడుగా మెరిసి భారీ హిట్
కొట్టాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీలో
నటిస్తున్నాడు. ఆ తర్వాత తనకు భారీ హిట్ ఇచ్చిన కొరటాలతో మూవీ
చేయబోతున్నాడు ఈ టాలీవుడ్ ప్రిన్స్. దూకుడు సినిమాలో ఎమ్మెల్యే అయిన
మహేశ్.. కొరటాల సినిమాలో ‘ముఖ్యమంత్రి’గా ప్రమోషన్ కొట్టేశాడని టాక్. గతంలో
సీఎంగా కనిపించిన ‘ఒకేఒక్కడు’ అర్జున్. శంకర్ డైరెక్షన్‌లో ఒక్క రోజు
ముఖ్యమంత్రి స్థాయి నుంచి పర్మనెంట్ సీఎం దాకా వెళ్లే పాత్రలో కనిపించాడు
అర్జున్. ఆ తర్వాత లీడర్ రానా ముఖ్యమంత్రయ్యాడు. ఇప్పుడు కొరటాల సినిమాతో
మహేశ్ కూడా సీఎంగా అసెంబ్లీ గడప తొక్కుతాడని సినీ జనాలు అంటున్నారు. ఇక,
సామాజిక అంశాలను స్పృశిస్తూ కొరటాల సీఎం కేరెక్టర్‌ను సృష్టించాడట. మిర్చి
నుంచి జనతాగ్యారేజ్ దాకా హిట్లు కొట్టిన అతడు.. అన్నింట్లోనూ సోషల్
ఎలిమెంట్స్‌ను టచ్ చేసి టాప్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు మహేశ్‌తో చేసే
సినిమాలోనూ సామాజిక అంశాలకు ఏ లోటు లేకుండా ముఖ్యమంత్రి పాత్రను
తీర్చిదిద్దాడని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు ఈ న్యూస్ నెట్‌లో
హల్‌చల్ చేస్తుండడంతో మహేశ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఒకవేళ అదే
నిజమైతే ఎమ్మెల్యేగా కనిపించిన ప్రిన్స్.. ముఖ్యమంత్రిగా ఎదగడం
చూడొచ్చన్నమాట!!

No comments:
Post a Comment