శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, పూజా జవేరీలు నటిస్తున్న
చిత్రం ‘ద్వారక’. ఈ సినిమా టీజర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేసిన
సంగతి తెలిసిందే.ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఫంక్షన్‌ను
శనివారం అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా),
ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హీరో నారా రోహిత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ
వేడుకలో పాడుతాతీయగా గాయకులతో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తిక్
లైఫ్ ప్రదర్శన ఇచ్చారు. తానా అధ్యక్షుడు జంపాల చౌదరి, ఉమెన్ సర్వీస్
కో ఆర్డినేటర్ రజనీ తదితరులు పాల్గొన్నారు. త్వరలో హైదరాబాద్‌లో
ద్వారక ఆడియోను విడదుల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.



No comments:
Post a Comment