ప్రపంచంలోనే అత్యంత తక్కువ
దూరం ప్రయాణించే అంతర్జాతీయ విమానాన్ని నడిపి ప్రపంచ రికార్డు
సృష్టించేందుకు ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ ‘పీపుల్ వీనలైన్’ సిద్ధమైంది.
స్విట్జర్లాండ్ లోని సెయింట్ గాలెన్ నుంచి జర్మనీలోని ఫ్రీడ్‌రిచ్‌షఫీన్‌కు
ప్రయాణించనుంది. ఈ రెండు దేశాల్లోని నగరాల మధ్య దూరం 13 మైళ్లు మాత్రమే.
మొత్తం ప్రయాణం 8 నిమిషాల్లో ముగియనుంది. ఈ ఏడాది నవంబరు 2 నుంచి ఈ విమాన
సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 50 సీట్ల సామర్థ్యం కలిగిన విమానంతో రోజూ
రెండు సర్వీసులు నిర్వహించనున్నారు. టికెట్ ధరలు కేవలం 45 డాలర్లు మాత్రమే.
రెండు దేశాల్లోని ఈ రెండు నగరాలను కాన్‌స్టాన్స్ నది వేరు చేస్తోంది.
ఆస్ట్రియన్ విమానయాన సంస్థ నిర్ణయించినట్టు నవంబరు నుంచి ఈ విమాన సర్వీసులు
అందుబాటులోకి వస్తే.. అతి తక్కువ దూరం ప్రయాణించే అంతర్జాతీయ విమానాలను
నడిపే సంస్థగా ‘పీపుల్ వీనలైన్’ గిన్నిస్ రికార్డులకెక్కనుంది.

No comments:
Post a Comment