తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని
ప్రపంచస్థాయికి చేర్చిన చిత్రం
‘బాహుబలి’. దర్శక ధీరుడు రాజమౌళి
అందించిన విజువల్ ట్రీట్‌కు
చిన్నా, పెద్దా తేడా లేకుండా
అందరూ ఫిదా అయిపోయారు. బాహుబలి
కొనసాగింపుగా ‘బాహుబలి: ద కన్‌క్లూజన్’
తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన
విలేకరుల సమావేశంలో ‘బాహుబలి-2’
లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా
నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ..
బాహుబలి రెండో భాగం దాదాపు పూర్తయిందని
తెలిపారు. కొన్ని సన్నివేశాలు,
రెండు పాటలు డిసెంబర్ నాటికి
పూర్తి చేస్తామన్నారు. జనవరిలో
బాహుబలి-2 ట్రైలర్‌ను విడుదల
చేస్తామన్నారు. అదే విధంగా ఏప్రిల్
28, 2017 ఈ చిత్రాన్ని ప్రేక్షకుల
ముందుకు తెస్తామని నిర్మాత
స్పష్టం చేశారు.Friday, 30 September 2016
‘బాహుబలి-2’ లోగో ఇదే!
తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని
ప్రపంచస్థాయికి చేర్చిన చిత్రం
‘బాహుబలి’. దర్శక ధీరుడు రాజమౌళి
అందించిన విజువల్ ట్రీట్‌కు
చిన్నా, పెద్దా తేడా లేకుండా
అందరూ ఫిదా అయిపోయారు. బాహుబలి
కొనసాగింపుగా ‘బాహుబలి: ద కన్‌క్లూజన్’
తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన
విలేకరుల సమావేశంలో ‘బాహుబలి-2’
లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా
నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ..
బాహుబలి రెండో భాగం దాదాపు పూర్తయిందని
తెలిపారు. కొన్ని సన్నివేశాలు,
రెండు పాటలు డిసెంబర్ నాటికి
పూర్తి చేస్తామన్నారు. జనవరిలో
బాహుబలి-2 ట్రైలర్‌ను విడుదల
చేస్తామన్నారు. అదే విధంగా ఏప్రిల్
28, 2017 ఈ చిత్రాన్ని ప్రేక్షకుల
ముందుకు తెస్తామని నిర్మాత
స్పష్టం చేశారు.
Labels:
Cinema
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment