కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?
ఈ ప్రశ్నకు సమాధానం కోసం యావత్
ప్రపంచం ఎదురు చూస్తోంది. ఇది
తెలియాలంటే ఏప్రిల్ 28, 2017న విడుదలయ్యే
‘బాహుబలి: ద కన్‌క్లూజన్’లో
చూడాల్సిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం
జరిగిన విలేకరుల సమావేశంలో
చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి,
నిర్మాత శోభు యార్లగడ్డ, ప్రధాన
పాత్రలు ప్రభాస్, రానాలు మాట్లాడారు.
ఈ చిత్రంలో నటించిన చాలా మందికి అక్టోబర్ నెల ప్రత్యేకమైందని అందుకే ఈ నెలలో చిత్రానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటున్నట్లు రాజమౌళి తెలిపారు. ‘బాహుబలి’ని మహా వృక్షంగా అభివర్ణించిన ఆయన సినిమా కేవలం ఒక కొమ్మ మాత్రమే అని పేర్కొన్నారు. బాహుబలికి సంబంధించిన కామిక్ బుక్స్, యానిమేటెడ్ సిరీస్, వర్చువల్ రియాల్టీ ఇలా చాలా ఉన్నాయని తెలిపారు.
ఇంకా ఆయనేమన్నారంటే...
* అక్టోబర్ 1న బాహుబలి యానిమేటెడ్ టీజర్ విడుదల చేస్తాం.
* అక్టోబర్ 5న ప్రభాస్ ఫ్యాన్స్‌కే కాదు, ప్రేక్షకులందరికీ ఓ గుడ్ న్యూస్ వెల్లడిస్తాం.
* అక్టోబర్ 22న ‘బాహుబలి-2’ ఫస్ట్‌లుక్, కామిక్‌బుక్‌ను విడుదల చేస్తాం.
* అక్టోబర్ 23న వర్చవల్ రియాల్టీ వీడియోను తీసుకొస్తాం.
* ‘బాహుబలి’ కథకు సంబంధించి దేనినైనా థియేటర్‌లోనే చూడటం ఉత్తమం.
* రెండో భాగంలో తమన్నాతో పాటలు లేవు. అనుష్కతో మాత్రం ఉంటాయి. తమన్నా కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కన్పిస్తారు.

* ‘బాహుబలి:
ద కన్‌క్లూజన్’కు సంబంధించి
క్లైమాక్స్ పూర్తయింది. సినిమాలో
అన్నింటికన్నా ఇదే కష్టమైంది.
ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా
క్లైమాక్స్ పూర్తి చేశాం. ఈ
విషయంలో నిర్మాత సహకారం కూడా
చాలా గొప్పది. మొత్తం గ్రాఫిక్స్
వర్క్ కూడా పూర్తయింది. రెండు
పాటలు.. ఒక యాక్షన్ పార్ట్
మాత్రమే చిత్రీకరించాలి.
* ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించి డిసెంబర్ చివరి నాటికి యూనిట్ సభ్యులందరూ విడుదలవుతారు. * బాహుబలి-3 ఏవిధంగా ఉంటుందనేది చెప్పలేను.
* జాతీయ స్థాయిలో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే వర్చువల్ రియాల్టీ టెక్నాలజీ ముందుకు తీసుకువస్తున్నాం.
* నేను లేకపోయినా బాహుబలి కొనసాగాలి.
* థియేటర్‌లోకి వెళ్లిన ప్రేక్షకుడిని కచ్చితంగా బాహుబలి ప్రపంచంలోకి తీసుకెళ్తాం.
* ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆర్నెల్ల పాటు ఎవరికీ కన్పించను(నవ్వుతూ..)
* ఈ చిత్రం గురించి ఒత్తిడి, బాధ్యత రెండూ నాలో ఉన్నాయి.
* బాహుబలి తొలి భాగానికి టెన్షన్ ఉంది. కానీ రెండో భాగానికి కొంచెం కూడా టెన్షన్ పడలేదు.
* ప్రపంచవ్యాప్తంగా 32 దేశాల్లో ‘బాహుబలి’ చిత్రాన్ని విడుదల చేశాం. జపాన్, కొరియా మాత్రం ఇంకా విడుదల చేయలేదు.
* ‘బాహుబలి ద: కన్‌క్లూజన్’లో ఇప్పటికే ఉన్న పాత్రలు తప్ప కొత్తగా ఎవరూ వచ్చి చేరలేదు.
విశ్రాంతి తీసుకుందామనే సినిమాలు చేయలేదు: ప్రభాస్
బాహుబలి చిత్రీకరణ సమయంలో మూడు నెలలకు పైగా ఖాళీ దొరికినా కేవలం విశ్రాంతి తీసుకుందామనే మరో చిత్రం చేయలేదని కథానాయకుడు ప్రభాస్ అన్నారు. మహా సముద్రం మధ్య చిన్న నదిని వదలడం భావ్యం కాదనిపించిందన్నారు. దర్శకుడు సుజిత్‌తో సహా రెండు, మూడు చిత్రాలు వరుసలో ఉన్నాయని తెలిపారు.

ఈ చిత్రంలో నటించిన చాలా మందికి అక్టోబర్ నెల ప్రత్యేకమైందని అందుకే ఈ నెలలో చిత్రానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటున్నట్లు రాజమౌళి తెలిపారు. ‘బాహుబలి’ని మహా వృక్షంగా అభివర్ణించిన ఆయన సినిమా కేవలం ఒక కొమ్మ మాత్రమే అని పేర్కొన్నారు. బాహుబలికి సంబంధించిన కామిక్ బుక్స్, యానిమేటెడ్ సిరీస్, వర్చువల్ రియాల్టీ ఇలా చాలా ఉన్నాయని తెలిపారు.
ఇంకా ఆయనేమన్నారంటే...
* అక్టోబర్ 1న బాహుబలి యానిమేటెడ్ టీజర్ విడుదల చేస్తాం.
* అక్టోబర్ 5న ప్రభాస్ ఫ్యాన్స్‌కే కాదు, ప్రేక్షకులందరికీ ఓ గుడ్ న్యూస్ వెల్లడిస్తాం.
* అక్టోబర్ 22న ‘బాహుబలి-2’ ఫస్ట్‌లుక్, కామిక్‌బుక్‌ను విడుదల చేస్తాం.
* అక్టోబర్ 23న వర్చవల్ రియాల్టీ వీడియోను తీసుకొస్తాం.
* ‘బాహుబలి’ కథకు సంబంధించి దేనినైనా థియేటర్‌లోనే చూడటం ఉత్తమం.
* రెండో భాగంలో తమన్నాతో పాటలు లేవు. అనుష్కతో మాత్రం ఉంటాయి. తమన్నా కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కన్పిస్తారు.
* ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించి డిసెంబర్ చివరి నాటికి యూనిట్ సభ్యులందరూ విడుదలవుతారు. * బాహుబలి-3 ఏవిధంగా ఉంటుందనేది చెప్పలేను.
* జాతీయ స్థాయిలో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే వర్చువల్ రియాల్టీ టెక్నాలజీ ముందుకు తీసుకువస్తున్నాం.
* నేను లేకపోయినా బాహుబలి కొనసాగాలి.
* థియేటర్‌లోకి వెళ్లిన ప్రేక్షకుడిని కచ్చితంగా బాహుబలి ప్రపంచంలోకి తీసుకెళ్తాం.
* ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆర్నెల్ల పాటు ఎవరికీ కన్పించను(నవ్వుతూ..)
* ఈ చిత్రం గురించి ఒత్తిడి, బాధ్యత రెండూ నాలో ఉన్నాయి.
* బాహుబలి తొలి భాగానికి టెన్షన్ ఉంది. కానీ రెండో భాగానికి కొంచెం కూడా టెన్షన్ పడలేదు.
* ప్రపంచవ్యాప్తంగా 32 దేశాల్లో ‘బాహుబలి’ చిత్రాన్ని విడుదల చేశాం. జపాన్, కొరియా మాత్రం ఇంకా విడుదల చేయలేదు.
* ‘బాహుబలి ద: కన్‌క్లూజన్’లో ఇప్పటికే ఉన్న పాత్రలు తప్ప కొత్తగా ఎవరూ వచ్చి చేరలేదు.
విశ్రాంతి తీసుకుందామనే సినిమాలు చేయలేదు: ప్రభాస్
బాహుబలి చిత్రీకరణ సమయంలో మూడు నెలలకు పైగా ఖాళీ దొరికినా కేవలం విశ్రాంతి తీసుకుందామనే మరో చిత్రం చేయలేదని కథానాయకుడు ప్రభాస్ అన్నారు. మహా సముద్రం మధ్య చిన్న నదిని వదలడం భావ్యం కాదనిపించిందన్నారు. దర్శకుడు సుజిత్‌తో సహా రెండు, మూడు చిత్రాలు వరుసలో ఉన్నాయని తెలిపారు.

No comments:
Post a Comment