నగరంలో
ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇక సుఖమయం..వేగవంతం కానుంది. సిటీలోని రద్దీని
దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక దారులను నిర్మించాలని అధికారులు
యోచిస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించడంతో పాటు ప్రగతి
రథ చక్రాలకు ఆర్థిక పరిపుష్టిని కల్పించేందుకు ముందడుగు వేస్తున్నారు.
ప్రస్తుతం ఈ విధానం అహ్మదాబాద్ నగరంలో విజయవంతంగా నడుస్తోంది. అక్కడ
ఆర్టీసీ కోసం ఏర్పాటు చేసిన బస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్టు సిస్టం
(బీఆర్‌టీఎస్)ను గ్రేటర్ పరిధిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈమేరకు
టీఎస్‌ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేసి ప్రభుత్వానికి అందించడానికి
సిద్ధమవుతున్నారు.ప్రయాణికులను నిర్ణీత సమయంలో గమ్యస్థానానికి చేర్చాలంటే ఈ
విధానం తప్పనిసరని చెబుతున్నారు.
నగర రహదారులు నిత్యం ట్రాఫిక్‌మయంగా మారుతున్నాయి. దీంతో అరగంటలో గమ్యాన్ని చేరుకోవాల్సిన ప్రయాణికులు ఒక్కోసారి గంటలతరబడి బస్సులోనే గడపాల్సి వస్తోంది. దీన్ని అధిగమించేందుకు ఆర్టీసీ అధికారులు నగర రహదారులపై బస్సులకు ప్రత్యేక ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అహ్మదాబాద్ నగరంలో ఆర్టీసీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్టు సిస్టం (బీఆర్‌టీఎస్)ను పోలిన విధంగా గ్రేటర్‌లోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనికోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్ధమవుతుంది.
సంస్థను బలోపేతం చేసేందుకు..
నగర రోడ్లపై ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులను సమయానికి గమ్యానికి చేర్చాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నది. తద్వారా ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసి, సంస్థను బలోపేతం చేసుకోవాలనే ధ్యేయంతో ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆర్టీసీ ప్రయాణికులను నిర్ణీత సమయంలో గమ్యస్థానానికి చేర్చాలంటే ఈ విధానం తప్పనిసరని భావిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తుండడంతో గమ్యస్థానాలకు చేరాలంటే ఆర్టీసీ బస్సులకు నిత్యం గగనమవుతోంది. దీంతో బస్సుల్లో ప్రయాణించే వారు సరైన సమయంలో చేరలేక నానా అవస్థలు పడుతున్నారు. నిర్ణీత సమయానికి చేరకపోవడంతో ఉద్యోగులతోపాటు ఇతర పనులమీద బస్సులను ఆశ్రయిస్తున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు.
వర్షం వస్తే అంతే..
వర్షం కురిస్తే సమస్యలు రెట్టింపవుతున్నాయి. నగరంలోని ఒకచోటు నుంచి మరోచోటుకు చేరుకోవాలంటే చాలా కష్టంగా ఉంటున్నది. ట్రాఫిక్‌లో చిక్కుకుని గంటల తరబడి ఆలస్యమవుతోంది. దీంతో ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయించకుండా క్యాబ్‌లు, ఆటోలతోపాటు ఇతర ప్రైవేటు వాహనాల్లో వెళ్తున్నారు. దీనివల్ల ఆర్టీసీకి నష్టం వాటిల్లుతోంది. ఏటా ఇదే పరిస్థితి పునరావృతమవుతోంది. వీటి నుంచి బయట పడేందుకు టీఎస్‌ఆర్టీసీ కసరత్తు చేస్తున్నది. వాస్తవానికి అహ్మదాబాద్ విధానాన్ని హైదరాబాద్‌లో అమలు చేయాలని అధికారులు ఎప్పుడో భావించినా.. ఎందుకో ఈ నిర్ణయం అటకెక్కింది. జేఎన్‌టీయూ నుంచి హైటెక్‌సిటీ వరకు ప్రయోగాత్మకంగా చేపట్టాలని మొదట భావించినా ఎందుకో అమలు కాలేదు.
ఇతర వాహనాలకు నో ఛాన్స్..
రహదారులపై ఆర్టీసీ బస్సులకు కేటాయించిన మార్గంలో కేవలం ఆర్టీసీ బస్సుల రాకపోకలనే అనుమతిస్తారు. ఇతర వాహనాలు వేరే మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గం ఖాళీగా ఉన్నా.. ఇతర వాహనాలు చొరబడితే జరిమానా విధిస్తారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సులు సజావు గా సాగిపోతాయి. ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉన్న ఈ ఆలోచన.. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే అమల్లోకి రానుంది. ప్రతీరోజు నగరంలో 3,850 సర్వీసులు నడుస్తున్నా కేటాయించిన ట్రిప్పులు పూర్తి కావడం లేదు. ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి. దీనివల్ల కేఎంపీఎల్ కూడా దెబ్బతింటోంది. ప్రత్యేక ట్రాక్(బీఆర్‌టీఎస్) విధానం అమల్లోకి వస్తే ప్రయాణికుల అభిమానాన్ని చూరగొని తద్వారా ఆదాయాన్ని సముపార్జించుకోవాలనే ఆలోచనతో ఆర్టీసీ ఉంది. ఈ విషయాన్ని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ కూడా వెల్లడించడంతో ఇక ఈ నిర్ణయం అతి త్వరలోనే రోడ్డెక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

No comments:
Post a Comment