మహబూబ్‌నగర్:- జిల్లాలో
రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
నిడుగుర్తికి చెందిన అంజప్ప, తిమ్మప్పలు కృష్ణ గ్రామానికి వెళ్లి తిరిగి
వస్తుండగా మాగనూర్ నుంచి చేగుంటకు వెళ్తున్న చంద్రశేఖర్, పవన్‌లు
ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టారు. అంజప్ప అక్కడికక్కడే మృతి చెందగా,
తిమ్మప్పను మక్తల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్ను మూశాడు.
చంద్రశేఖర్, పవన్‌లకు గాయాలు కాగా వీరిని రాయిచూర్‌లోని ప్రవేటు
ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
No comments:
Post a Comment