ఉత్తర్‌ప్రదేశ్:
భార్యపై అనుమానంతో ఓ కసాయి భర్త ఆమె ముక్కు కొరికేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో
చోటుచేసుకుంది. షాజహాన్‌పూర్‌కి చెందిన సంజీవ్ కొంతకాలంగా భార్య
కమలేశ్‌పై అనుమానం పెంచుకున్నాడు. బుధవారం కమలేశ్ ఎవరితోనో
ఫోనులో మాట్లాడుతుండడం గమనించిన సంజీవ్ ఆమెతో గొడవపెట్టుకున్నాడు.
కోపంతో ఎవరికీ ఆమె అందంగా కన్పించకూడదంటూ ముక్కు కొరికేశాడు. తెగిన
ముక్కుతో రక్తమోడుతున్న బాధితురాలిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి
తరలించారు. పరారీలో ఉన్న సంజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

No comments:
Post a Comment