బ్రసీలియా:
ప్రపంచంలోనే
అతి పెద్ద అనకొండ బ్రెజిల్‌లో బయటపడింది. బ్రెజిల్‌లోని ఉత్తరప్రాంతంలో
అల్టామిరా వద్ద బెలో మాంటె డ్యాం నిర్మాణ పనుల్లో భాగంగా పేలుడు
జరిపినప్పుడు ఈ అనకొండ బయటపడింది. 33 అడుగుల పొడవున్న ఈ పాము 400 కేజీల
బరువుంది. పాము వెడల్పు మీటరుకు పైగా ఉంది. అతిపెద్దదైన ఈ పామును చూడగానే
కార్మికులు తొలుత షాకయ్యారు. తర్వాత పాము పేలుడులో చనిపోయిందని తెలుసుకుని
భారీ క్రేన్‌తో ఎత్తి పక్కకు పెట్టేశారు. అయితే పాము పేలుడులో చనిపోయిందా
లేక చంపేశారా అనే విషయంపై సోషల్ మీడియాలో బిగ్‌ఫైట్ నడుస్తోంది. పాపం
పామును చంపేస్తారా అంటూ కొందరు జంతు ప్రేమికులు విరుచుకుపడ్డారు. మరోవైపు
గిన్నీస్ బుక్ రికార్డుల ప్రకారం అమెరికాలోని కన్సాస్ నగరంలో 25 అడుగుల
రెండు అంగుళాలున్న అనకొండయే అతి పెద్ద పాముగా రికార్డులకెక్కింది.

No comments:
Post a Comment