Sunday, 11 September 2016

పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన భారత పేస్ బౌలర్!

భారత క్రికెట్ జట్టు సభ్యులు సాధారణంగా రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెడతారని ఊహించడం సహజం. అయితే అందుకు భిన్నంగా ప్రస్తుతం టీం ఇండియాలో ఆడేందుకు అవకాశముండగానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు భారత పేస్ బౌలర్ ప్రవీణ్ కుమార్. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఆదివారం రాజధాని లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో సామాజ్ వాదీ పార్టీలోకి అడుగుపెట్టారు బౌలర్ ప్రవీణ్ కుమార్. ఆయనను పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం అఖిలేష్. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశముంది.
 
ప్రవీణ్ భారత్‌కు పేస్ బౌలింగ్ చేస్తూ 68 వన్డేలు, 6 టెస్ట్‌లు ఆడాడు. టెస్టుల్లో 27, వన్డేల్లో 77 వికెట్లు పడగొట్టాడు. ఐపిఎల్ గుజరాత్ లయన్స్ జట్టు తరుపున ఆడుతున్న ప్రవీణ్ మొత్తం పది అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లాడి 8 వికెట్లు పడగొట్టాడు. ప్రవీణ్ తన బౌలింగ్‌లో చక్కని స్వింగ్ రాబట్టి బ్యాట్స్‌మన్‌ను బోల్తా కొట్టించగలడు.

No comments:

Post a Comment