Sunday, 11 September 2016

తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు

వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో ఇది అల్పపీడనంగా ద్రోణిగా మారి.. తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటోంది వెదర్ రిపోర్ట్. అల్పపీడన ద్రోణిగా మారితే రేపటినుంచి నాలుగురోజుల పాటు కురుస్తాయి. సోమ, మంగళవారాల్లో అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈనెల 13 తరువాత ఉత్తర తెలంగాణలో విస్తారంగావర్షాలు పడతాయంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. ఇవాళ రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. సిద్దిపేటలో భారీ వర్షం పడగా.. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి మండలాల్లో వానపడింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆరుతడి పంటలకు ఉపయోగపడే అవకాశముంది. పెద్దపల్లి, మంథని, జగిత్యాల, సిరిసిల్లలో వాతావరణం కూల్ గా మారింది..
హైదరాబాద్ లోనూ పలుచోట్ల వర్షం పడింది. శివారు ప్రాంతాలైన హయత్ నగర్, ఉప్పల్, కీసరతోపాటు.. హబ్సిగూడ, నాంపల్లి, కోఠి, బంజారాహిల్స్ లో ఓమోస్తరు వర్షం కురిసింది. గడచిన 24 గంటల్లో పరకాలలో 8 సెంటీమీటర్లు, ఆత్మకూరులో 4, పాల్వంచలో 3, ఖమ్మంలో 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ ఎమ్ సీ కి సూచించింది వాతావరణ శాఖ. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు జీహెచ్ ఎమ్ సీ మేయర్. మరోవైపు ఆరుతడి పంటలు వేసిన రైతులు.. వర్షాలు వస్తుండడంతో.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment