Thursday, 15 September 2016

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ గణేశుడు

నవరాత్రులు భక్తుల పూజలందుకున్న ఖైరతాబాద్‌ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. ఖైరతాబాద్‌ నుంచి అత్యంత వైభవంగా సాగిన వూరేగింపుతో ట్యాంక్‌బండ్‌కు చేరిన గణనాథుడిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన భారీ క్రేన్‌ సాయంతో నిర్వహించిన వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు లక్షలాది ప్రజలు తరలివచ్చారు. దీంతో హుస్సేన్‌సాగర్‌ పరిసరాలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తరలివచ్చిన ప్రజలు వినాయకుడికి వీడ్కోలు పలికారు.

No comments:

Post a Comment