Friday, 16 September 2016

ఆరంగుళాల తెరతో సామ్‌సంగ్‌ ఏ9 ప్రో

దక్షిణకొరియాకు చెందిన దిగ్గజ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ సామ్‌సంగ్‌ మరో కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఏ సిరీస్‌లో 6 అంగుళాల డిస్‌ప్లేతో గెలాక్సీ ఏ9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 32,490గా నిర్ణయించింది. సెప్టెంబర్‌ 26 నుంచి సామ్‌సంగ్‌ స్టోర్లు, ఈ-కామర్స్‌ పోర్టళ్లలో గెలాక్సీ ఏ9 ప్రో ఫోన్‌ వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది.
 
గెలాక్సీ ఏ9 ప్రో ఫీచర్లు:-
* గొరిల్లా గ్లాస్‌తో 6 అంగుళాల డిస్‌ప్లే
* 64బిట్‌ స్నాప్‌డ్రాగన్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
* ఆండ్రాయిడ్‌ 6.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
* 4 జీబీ రామ్‌
* 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
* 16 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
* 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా
* డ్యుయల్‌ సిమ్‌ సదుపాయం
* ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ ఫీచర్‌
* 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
* 4జీ ఎల్‌టీఈ సదుపాయం

No comments:

Post a Comment