నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్
దర్శకత్వం వహిస్తున్న ‘గౌతమిపుత్ర
శాతకర్ణి’ చిత్రం షూటింగ్
మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న
సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం
ఈ చిత్రంలోని పాటను చిత్రీకరిస్తున్నట్లు
చిత్ర బృందం ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ సందర్భంగా నిర్మాతలు వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ.. ‘ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో చిరంతన్‌భట్‌ను తీసుకున్నాం. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన, సీనియర్ డ్యాన్స్ మాస్టర్ స్వర్ణ దర్శకత్వంలోని పాటను మధ్యప్రదేశ్‌లో చిత్రీకరిస్తున్నారు. ముంబైకి చెందిన క్లాసికల్ డ్యాన్సర్ ఈ పాటలో నర్తిస్తున్నారు.
బాలకృష్ణ, శ్రియ, హేమమాలిని, కబీర్ బేడి పాల్గొన్న ఈ నాల్గో షెడ్యూల్‌లో రాజసూయయాగం చిత్రీకరణ పూర్తి చేశాం. బాలకృష్ణ ఇతర తారాగణంపై రాజదర్బార్ సెట్‌లో ఓ పాటను చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 25న పాట చిత్రీకరణతో షెడ్యూల్ పూర్తవుతుంది. దీంతో చిత్రం 80 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంటుంది. సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని చెప్పారు.

No comments:
Post a Comment