Monday, 12 September 2016

ఈ నెలలోనే ‘కోటీశ్వరుడు’ షూటింగ్!

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అంటూ ఇప్పటిదాకా నాగార్జున పలకరించాడు. ఇప్పుడు అదే స్థానంలో చిరంజీవి పలకరించబోతున్నాడు అంటూ నాగార్జున ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఖైదీ నంబర్-150 షూటింగ్‌లో మెగాస్టార్ బిజీగా ఉన్నాడు. కార్యక్రమం నాలుగో సీజన్‌కు చిరంజీవి ఒప్పుకొన్నాడని, ఈ నెలాఖరు నుంచి కార్యక్రమం షూటింగ్‌లో పాల్గొంటాడని, ఈ నెలలో కొన్ని ఎపిసోడ్లు, అక్టోబరు‌లో మిగతా ఎపిసోడ్లు షూట్ చేస్తారని చిరంజీవి సన్నిహితులు తెలిపారు. తర్వాతి సీజన్‌కు కూడా చిరునే కార్యక్రమాన్ని నడిపిస్తారా అన్న ప్రశ్నకు.. ఆ విషయాన్ని పక్కాగా చెప్పలేమని, అది ఈ సీజన్‌కు వచ్చిన స్పందనపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. పలు ఇతర అంశాలూ చిరు మళ్లీ హోస్ట్ చేస్తారా? లేదా? అన్న దానిపై ప్రభావం చూపిస్తాయని వెల్లడించారు. కాగా, తొలి రెండు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన నాగ్.. ప్రస్తుతం ‘ఓం నమో వెంకటేశాయ’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. చూద్దాం చిరు చేసే షోకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో!!

No comments:

Post a Comment