Friday, 16 September 2016

మరో రెండు రోజుల పాటు వర్షాలు

                తెలంగాణ, విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని చెప్పారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వివరించారు. ఆ తర్వాత క్రమంగా వర్షాలు తగ్గుముఖం పడతాయని పేర్కొన్నారు. ఇక ఇవాళ గరిష్టంగా మెదక్‌లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా హైదరాబాద్‌లోని అసిఫ్‌నగర్‌లో 19 మిల్లీమీటర్లు, మాదాపూర్‌లో 18 మిల్లీమీటర్లు వర్షం నమోదైందని అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment