స్టీఫెన్ హాకింగ్స్
అనంత విశ్వంలో మనం ఒంటరిగా వున్నామా? ఇతర గ్రహాల్లో లేదా సుదూర
దూరంలోని ఇతర పాలపుంతల్లో జీవ సంచారం వుందా లేదా అన్న ప్రశ్నలు మానవుడిని
వేల సంవత్సరాలుగా వేధిస్తున్నాయి. అయితే విశ్వంలో కొన్ని కాంతి సంవత్సరాల
దూరంలో గ్రహాంతరజీవులు వుండే అవకాశముందని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త
స్టీఫెన్ హాకింగ్స్ అభిప్రాయం వ్యక్తంచేశారు. అయితే వారు మన వునికిని
గుర్తిస్తే భూగ్రహానికి ప్రమాదం ఎదురయ్యే అవకాశముందని ఆయన ఆందోళన
వ్యక్తంచేశారు.
ఏదో ఒక రోజు సిగ్నల్స్ రావచ్చు
‘స్టీఫెన్ హాకింగ్స్ ఫేవరెట్ ప్లేసస్’ అనే డాక్యుమెంటరీ ద్వారా ఆయన ఈ విశేషాలను వెల్లడించారు. మనకు 16 కాంతి సంవత్సరాల దూరంలో వున్న ఒక గ్రహం నుంచి ఎప్పటికయినా సిగ్నల్స్ రావచ్చని అయితే మనం తిరిగి స్పందించకూడదన్నారు. వారితో కలయిక మనకు నష్టాన్ని కలిగించవచ్చన్నారు. క్రిస్టఫర్ కొలంబస్ రాకకు పూర్వం అమెరికా అపూర్వమైన నాగరికత కలిగివున్న విషయాన్ని గుర్తు చేశారు. గ్రహాంతర జీవులు అన్ని రకాలుగా మనకన్నా అభివృద్ధి చెందివుంటారని వారితో సాన్నిహిత్యం భూగ్రహంలో వారి వలసపాలనకు దారి తీస్తుందన్నారు. కొన్నేళ్ల క్రితం ‘బ్రేక్‌త్రూ లిజన్ ప్రాజెక్టు’ను ప్రారంభించిన హాకింగ్స్ కనీసం ఒక మిలియన్ నక్షత్రాలను శోధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

No comments:
Post a Comment