వరంగల్‌లోని ఉర్సు
ప్రాంతంలోగల రంగసముద్రం చెరువు మత్తడి వద్ద చేపల వేటకు వెళ్లిన శనివారం
స్థానికులకు అరుదైన చేప లభ్యమైంది. ఆ చేపను చూసిన వారంతా భయబ్రాంతులకు
గురయ్యారు. ఆ చేప శరీరమంతా మచ్చలు, ముళ్లు కలిగి వింత ఆకారంలో ఉంది. చేప
ఏడువందల యాభై గ్రాముల బరువు ఉంది. ఈ చేపను మత్య్సకారులు దెయ్యం చేపగా
పిలుస్తారని వారు చెబుతున్నారు. అధికారులు దానిని సక్కర్ ఫిష్ జాతికి
చెందిన విషపు చేప అంటున్నారు. ఆ చేప నీటిలో ఉన్న చిన్నచేపలను తింటుందని
వారు తెలిపారు. నక్కర్ జాతికి చెందిన చేపను తినకూడదని, తింటే అనేక ఆరోగ్య
సమస్యలు వస్తాయని అధికారులు పేర్కొన్నారు.

No comments:
Post a Comment