తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయికల్లో ఒకరిగా గుర్తింపును సొంతం చేసుకుంది
కాజల్ అగర్వాల్. దక్షిణాదిలో స్టార్ హీరోలందరి సరసన నటించిందామె.
కథానాయికగా అవకాశాలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఇటీవలే విడుదలైన జనతా
గ్యారేజ్ చిత్రంలో పక్కా లోకల్ పాటతో ప్రత్యేక గీతాల భామగా అవతారమెత్తింది
కాజల్ అగర్వాల్. ఈ పాటలో గ్లామర్ తళుకులతో ఆకట్టుకున్న ఆమెకు ఐటెంసాంగ్స్
అవకాశాలు వెల్లువెత్తుతున్నట్లు సమాచారం. ప్రత్యేక గీతాల్లో
నటించాల్సిందిగా పలువురు దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నట్లు
తెలిసింది. భారీ పారితోషికాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని, అయితే ఈ
ప్రత్యేక గీతాల్లో నటించడానికి కాజల్ అగర్వాల్ నిరాకరిస్తున్నట్లు వార్తలు
వినిపిస్తున్నాయి. ఐటెంసాంగ్స్‌పై దృష్టిసారిస్తే హీరోయిన్‌గా కొనసాగడం
కష్టమనే ఆలోచనతోనే ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం
తెలుగులో చిరంజీవి సరసన ఖైదీ నెంబర్ 150తో పాటు తేజ దర్శకత్వంలో
రూపొందుతోన్న ఓ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది కాజల్ అగర్వాల్.

No comments:
Post a Comment