Friday, 16 September 2016

నిర్మలా కాన్వెంట్ రివ్యూ

నిర్మాణ సంస్థలు: అన్నపూర్ణ స్టూడియోస్, మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్, కాన్సెప్ట్ ఫిలిం ప్రొడక్షన్
తారాగణం: అక్కినేని నాగార్జున, రోషన్, శ్రియాశర్మ, ఎల్.బి.శ్రీరాం, ఆదిత్యమీనన్, సమీర్, రవిప్రకాష్, సూర్య, ప్రసన్నకుమార్, తాగుబోతు రమేష్, జోగి బ్రదర్స్, ప్రభు, ప్రవీణ్, సత్యకృష్ణ తదితరులు.
కథ: కాన్సెప్ట్ ఫిలింస్
ఆర్ట్: రమణ వంక
ఎడిటింగ్: మధుసూదనరావు
మ్యూజిక్: రోషన్ సాలూరి
సినిమాటోగ్రఫీ: ఎస్.వి.విశ్వేశ్వర్
నిర్మాతలు: నిమ్మగడ్డ ప్రసాద్, అక్కినేని నాగార్జున
రచన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగ కోటేశ్వరరావు
 
రేటింగ్:- 2.25/5
 ప్రకృతిలో ప్రేమ చాలా గొప్పది..దాన్ని మించిన ఇన్ స్పిరేషన్ లేదు..ఈ పాయింట్ తో అల్లుకున్న కథే నిర్మలా కాన్వెంట్. చాలా మంది ప్రేమ గురించి ఎప్పుడో చెప్పింది కదా, ఇందులో కొత్తదనం ఏముంది అనుకోవచ్చు. కొత్తదనం లేకపోయినా ఈ సినిమా ద్వారా ఓ కొత్త దర్శకుడు(జి.నాగకోటేశ్వరరావు), కొత్త హీరో రోషన్, హీరోయిన్ శ్రియా శర్మ, రెహమాన్ తనయుడు అమీన్ సింగర్ గా పరిచయం కావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. వీటికి తోడు అక్కినేని నాగార్జున నిర్మాణంలో భాగస్వామ్యం కావడంతో పాటు, నటించాడు. సాధారణంగా మంచి కాన్సెప్ట్ ఉంటే కానీ సపోర్ట్ చేయని నాగార్జున ఈ స్థాయి సహకారం అందిస్తున్నాడంటే సినిమా మంచి విషయముందని ప్రేక్షకులు సినిమాపై అంచనాలు పెంచుకున్నారు. మరి ఈ నిర్మలా కాన్వెంట్ లో దర్శకుడు టీనేజ్ లవ్ గురించి ఏ విషయాలు చెప్పాడనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే....
 
కథ: భూపతి నగరం ఊర్లో 99 ఎకరాల ఆసామి అయిన రాజుగారికి ఒక ఎకరం ఉన్న వీరయ్య (ఎల్.బి.శ్రీరాం)కు పడదు. అందుకు తన కులపోళ్లను గుడిలోకి అనుమతించకపోవడం, చెరువు నీళ్ళు తాగనీయకపోవడం వంటి కారణాలుంటాయి. అంతే కాకుండా రాజుగారి పొలానికి కావాల్సిన నీళ్ళు వీరిగాడి పొలం నుండే రావాలి. అందుకు వీరయ్య పేచీ పెడుతుంటాడు. దాంతో ఊర్లో జరిగే ఉత్సవాల సమయంలో వీరయ్యను, రాజుగారు మనుషులు చంపేస్తారు. వీరిగాడు చనిపోతు కొడుకు సూరయ్య(సూర్య)తో ఆ ఎకరం పొలం ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదంటూ మాట తీసుకుని చనిపోతాడు. తండ్రి మరణం తర్వాత సూరయ్య క్రిస్టియన్ మతంలోకి మారిపోయి డేవిడ్ అని పేరు మార్చుకుంటాడు. మేరి(అనితా చౌదరి)ని పెళ్ళి చేసుకుంటాడు. డేవిడ్, మేరిల కొడుకు శామ్యూల్స్(రోషన్). రాజుగారి కొడుక్కి (ఆదిత్యమీనన్) కూడా కూతురు పుడుతుంది. ఆమె పేరే శాంతి(శ్రియాశర్మ). శామ్యూల్స్ చదువుల్లో ఫస్ట్ అంతే కాకుండా తన చుట్టూ పక్కల జరిగే విషయాలపై మంచి అవగాహనతో, నాలెడ్జ్ తో ఉంటాడు. శామ్యూల్స్, శాంతి మధ్య ప్రేమ పుడుతుంది. దాని వల్ల ఎలాంటి పరిస్థితులు తలెత్తాయి? అసలు శామ్యూల్స్ హైదరాబాద్ వచ్చి నాగార్జున అక్కినేనికి చాలెంజ్ ఎందుకు విసురుతాడు? చివరకు శామ్యూల్, శాంతిల ప్రేమ గెలిచిందా? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే....
 
సమీక్ష: శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా చాలా మంచి మార్కులు కొట్టేశాడు. తన మొదటి సినిమాలా అనిపించలేదు. చాలా కాన్ఫిడెంట్ గా, ఈజ్ తో నటించాడు. శామ్యూల్స్ టీనేజ్ అబ్బాయి పాత్రలో ఒదిగిపోయాడు. తనకు మంచి భవిష్యత్ ఉంది. శ్రియాశర్మ తన పాత్ర పరిధిమేర చక్కగా యాక్ట్ చేసింది. ఆదిత్యమీనన్, సత్యకృష్ణ, తాగుబోతు రమేష్, రోషన్ కనకాల, సూర్య, అనితా చౌదరి, ఎల్.బి.శ్రీరాం సహా అందరూ వారి వారి క్యారెక్టర్స్ కు న్యాయం చేశారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కినేని నాగార్జున గురించే, నిర్మలాకాన్వెంట్ చిత్రానికి ఈ రేంజ్ బజ్ రావడానికి ఆయనే కారణం. ఇటు నిర్మాణంలో, అటు నటన పరంగా సినిమాకు బాగా హెల్ప్ అయ్యారనే చెప్పాలి. నిజ జీవితంలో ఆయన పోషించిన మీలో ఎవరు కోటీశ్వరుడు హోస్ట్ పాత్రనే ఆయన ఇందులో చేయడం విశేషం. దానికి లెటెస్ట్ వెర్షన్ చాంపియన్ ఆఫ్ చాంపియన్స్ అంటూ నాగ్ వెండితెరపై చేసిన సందడి అభిమానులను ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ అంతా నాగార్జున భుజాలపై మోశాడనాలి. ఎందుకంటే ఫస్టాఫ్ రొటీన్ కాన్సెప్ట్ తో సాగే సినిమాలో ప్రేక్షకుడికి కొత్తగా అనిపించేదేం ఉండదు. అయినా సెకండాఫ్ చివరి వరకు కూర్చున్నాడంటే ఏకైక కారణం నాగార్జున మాత్రమే. సినిమాలో ఫస్టాఫ్ హీరో, హీరోయిన్ మధ్య లవ్, వాళ్ళింట్లో తెలిసిపోవడం వంటి విషయాలు కామన్ గానే ఉన్నా, దాన్ని ఎంటర్ టైనింగ్ గా మలవడంలో దర్శకుడు నాగ కోటేశ్వరరావు ఫెయిలయ్యారు. విశ్వేశ్వర్ కెమెరా పనితనంతో ప్రతి సీన్ చాలా ఫ్రెష్ లుక్ తో, రిచ్ గా కనిపడింది. దర్శకుడు అది చాలనుకన్నాడేమో సినిమాని ఆసక్తికరంగా ఉండేలా చూడాలనే విషయాన్ని మరచిపోయాడు. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే ఓ తెలివైన కుర్రాడు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం లెటెస్ట్ వెర్షన్ లాంటి చాంపియన్ ఆఫ్ చాంపియన్స్ చుట్టూనే తిరుగుతుంది. సెకండాఫ్ చూస్తుంటే స్లమ్ డాగ్ మిలియనీర్ చూస్తున్నట్టపిస్తుంది కానీ ఎమోషన్స్ క్యారీ చేయడంలో దర్శకుడు విఫలయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్ మంచి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ముఖ్యంగా కొత్త కొత్త భాష...సాంగ్ తో పాటు ముద్దుల పేర్లపై వచ్చే సాంగ్ బావుంది. అలాగే కొత్త కొత్త భాష సాంగ్ ను ఎ.ఆర్.రెహమాన్ తనయుడు ఎ.ఆర్.అమీన్ చక్కగా పాడాడు. తన వాయిస్ సినిమాకు ప్లస్ అయ్యింది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. కాగా ఈ చిత్రంలో హీరో హీరోయిన్స్ ది టీనేజ్ లవ్ స్టోరీ, ముద్దుల గొడవ యూత్ పాడవుతుందనిపిస్తుంది కానీ కొత్తగా చెప్పిందేమీ లేదు. ఇందులోనాగార్జునకు నచ్చిందేమిటో ఆయనే చెప్పాలి. మొత్తం మీద నిర్మలా కాన్వెంట్ సినిమాను నాగార్జున కోసం, రోషన్ కోసం ఓసారి చూడవచ్చు.
 
బోటమ్ లైన్: `నిర్మలా కాన్వెంట్`...అవుట్ డేటెడ్ టీనేజ్ లవ్ స్టోరీ
 
ప్లస్ పాయింట్స్:
-అక్కినేని నాగార్జున
-రోషన్ నటన
-బ్యాక్ గ్రౌండ్ స్కోర్
-సినిమాటోగ్రపీ
 
మైనస్ పాయింట్స్:
-పాత కథ
- ఫస్టాఫ్
-ఎంటర్ టైన్ మెంట్

No comments:

Post a Comment