Sunday, 11 September 2016

ఈపీఎఫ్‌వో వడ్డీరేటుపై కోత..?

ఈ ఆర్థిక సంవత్సరం ఈపీఎఫ్‌వో వడ్డీ రేటుపై కోత విధించవచ్చని భావిస్తున్నారు. దీని ప్రభావం సుమారు నాలుగు కోట్ల మంది ఉద్యోగులపై పడనుంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌వో వడ్డీరేటు 8.8శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన చిన్నమొత్తాల పొదుపు పథకాలపై ఉన్న వడ్డీరేట్లతో దీనిని సమం చేయాలని ఆర్థిక మంత్రిత్వశాఖ కార్మికశాఖను కోరింది. 8.6శాతం వడ్డీ చెల్లించాలన్న దానిపై ఇరు శాఖలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. కానీ ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయవనరులపై ఈపీఎఫ్‌వో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ది సెంట్రల్‌బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ, ఈపీఎఫ్‌వో అత్యుత్తమ నిర్ణాయక సంస్థ ఆదాయవనరులపై చర్చించి అప్పుడు వడ్డీరేట్లను ప్రకటిస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక, గణాంక, పెట్టుబడి కమిటీ సలహా సంఘం అనుమతించిన వడ్డీరేట్లను సెంట్రల్‌బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ ఆమోదిస్తుంది.
ఈపీఎఫ్‌వో వడ్డీ రేట్లపై నిర్ణయంలో ఆర్థిక శాఖ చొచ్చుకురావడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగులకు చెందిన సొమ్మును పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తోందని దీనిలో ఆర్థిక శాఖ జోక్యం ఉండకూడదంటోంది.
ప్రస్తుతం ఆర్థిక శాఖ మాత్రం పీపీఎఫ్‌ వడ్డీరేట్లను 8.6శాతంకు తగ్గించాలని భావిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ సెక్యూరిటీలపై రాబడిని ఇతర మార్గాల్లో గణించి ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది.

No comments:

Post a Comment